వినుకొండలో రెడ్ బుక్కు రాజ్యాంగం..
* కూటమికి కొమ్ము కాస్తున్న ఖాకీలు..
* వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు
* బాధితులకు అండగా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేయబడతాం.. బొల్లా..
న్యూస్ తెలుగు /వినుకొండ : నియోజకవర్గంలో రెడ్ బుక్కు రాజ్యాంగం ద్వారా కూటమి ప్రభుత్వం వైసిపి కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఘాటుగా విమర్శించారు. సోమవారం వైసిపి కార్యాలయంలో వైసిపి ముఖ్య నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాడు వైసిపి కార్యకర్త రషీద్ హత్య జరిగిన నాటి నుండి వైసిపి నాయకులపై, కార్యకర్తలపై దాడులు పోలీసు అక్రమ కేసులు పెరిగిపోతున్నాయని బొల్లా విమర్శించారు. గత నెల 16వ తేదీన ఓ ముస్లిం కుటుంబం వివాహ సందర్భంలో ఊరేగింపు నిర్వహించుకుంటూ తమ నేతను ఉదాహరించుకుంటూ యువకులు పాటలు పాడుతుండగా, సహించలేని టిడిపి నేతలు పోలీసులను ఊరేగింపు పై ఉసిగొలిపి ఆ ఊరేగింపును చెదరగొట్టే క్రమంలో కొందరు యువకులు పోలీసులకు అడ్డు తిరగటం జరిగింది. పోలీసులు దీన్ని ఆసరాగా తీసుకొని 11 మంది వైసీపీకి చెందిన యువకులపై నాన్ బెయిల్ బుల్ కేసులు బనాయించారని బొల్లా వివరించారు. దీంతో బాధితులు హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవటం జరిగిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని టిడిపి వారు మరల స్థానిక పోలీసు అధికారులను వైసీపీ కార్యకర్తలపై ఉసిగొలిపి జాబీర్ అనే యువకుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లకుండా ఓ ప్రైవేటు గదికి తీసుకువెళ్లి నానా రకాలుగా హింసించారని విలేకరుల సమావేశంలో బాధితుడు వెల్లడించాడు. ఒంటిపై బట్టలు కూడా తీసి గోచిపెట్టి లాఠీలతో బాధటం ఈ క్రమంలో ఎడమ కంటికి గాయమైందంటూ వివరించాడు. వైసిపికి మద్దతు ఇస్తే ఇలా దాడులు జరుగుతున్నాయి అంటూ బొల్లా అన్నారు. ఈ అక్రమ కేసులు, దాడులు చీప్ విప్ జీవి ఆంజనేయులకు తెలియదా అని బ్రహ్మనాయుడు ప్రశ్నించారు. అలాగే పలుకూరు, టి. అన్నవరం గ్రామాలలో వైసిపి వర్గానికి చెందిన వారిపై కూటమి నేతల దాడులు, పోలీస్ అక్రమ కేసులు పెరిగిపోతున్న కారణంగా కొన్ని కుటుంబాలు వలసలు వెళ్ళిపోతున్నాయని, ఇక శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో వినాయకుని ఊరేగింపు సమయంలో వైసిపి వారు టిడిపి వారిపై దాడి చేయబోతున్నారంటూ, పోలీసు యంత్రాంగాన్ని అంతా గ్రామంలో దింపి వైసిపి వారిపై 307 కేసులు పెట్టించారని బొల్లా ఈ సందర్భంగా తెలిపారు. అలాగే బొల్లాపల్లి మండలం పలుకూరు గ్రామం రేషన్ షాపు దుకాణం దారుడు వైసీపీకి చెందిన వాళ్లంటూ, ఆ కోటాను రద్దు చేయించడం జరిగిందని, దీంతో బాధిత డీలర్ హైకోర్టును ఆశ్రయించి మరల రేషన్ దుకాణాన్ని తెచ్చుకోగా, ఇది సహించలేని కూటమి నేతలు ఆ కుటుంబాన్ని పోలీసుల ద్వారా నానా రకాలుగా హింసిస్తున్నారని బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా తెలియపరుస్తామని, పోలీసుల తీరు మారకపోతే బాధితులను సమీకరించి స్థానిక పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బొల్లా హెచ్చరించారు. కాగా వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములకు గత ప్రభుత్వ హయాంలో ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు బోర్డులు పెట్టడం జరిగిందని, అయితే నేడు ఆ బోర్డులు పీకి వేసి ఆ భూములు కూటమినేతలకు బదలాయిస్తున్నారంటూ బొల్లా విమర్శించారు.
* తుఫాన్ బాధితులను ఆదుకోవాలి……
ఇటీవల వచ్చిన తుఫానుకు రాష్ట్రంలో రైతాంగం కుదేలైందని తీవ్రంగా పంట నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా చేస్తున్న సహాయం ఏమాత్రం సరిపోదని బొల్లా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బొప్పాయి, పత్తి, మామిడి, మిరప, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, తక్షణం భారీ సహాయం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని బొల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం కేస్ అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేయడం విచారకరమని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలా అరెస్టులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కల్తీ మద్యం ఈ ప్రభుత్వంలో బయటపడలేదా, దొంగే, దొంగ దొంగ అన్నట్లుగా ఉందని బొల్లా అన్నారు. సీనియర్ న్యాయవాది, పల్నాడు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి. ఎం. ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ. పెళ్లి ఊరేగింపుల్లో డ్యాన్స్ లు, పాటలు నేరమా అని ఆయన ప్రశ్నించారు. కేవలం వైసీపీ వర్గానికి చెందిన వారంటూ పెళ్లి ఊరేగింపులో పోలీసు అధికారులు సిబ్బంది దాడి చేసి యువకులను పోలీస్ స్టేషన్ కు తరలించి నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం పోలీసుల తెలివితేటలకు నిదర్శనం అన్నారు. రానున్న రోజుల్లో పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ప్రభుత్వానికి, పోలీసులకు బుద్ధి చెబుతారన్నారు. పోలీసులు సెక్షన్లు తెలుసుకొని చట్టబద్ధ పాలన చేయాలని ఎం. ఎన్. అన్నారు. ఈ సమావేశంలో నాయకులు కొత్తమాస శివ, పగడాల వెంకటరామిరెడ్డి, బేతం గాబ్రియేలు, పిఎస్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు. (Story:వినుకొండలో రెడ్ బుక్కు రాజ్యాంగం..)

