Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కు సేవ రత్న పురస్కారం

యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కు సేవ రత్న పురస్కారం

యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కు సేవ రత్న పురస్కారం

న్యూస్ తెలుగు /వినుకొండ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి, హైదరాబాద్ విశ్వజనని ఫౌండేషన్ వారు వివిధ సేవ కార్యక్రమాలతో సమాజ సేవలో నిమగ్నలై వున్నవారికి ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో వినుకొండ కు చెందిన యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారు వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను విశ్వజనని ఫౌండేషన్ వారు గుర్తించి విశ్వజనని సేవ రత్న పురస్కారం ఫౌండేషన్ చైర్మన్ బొగ్గవరపు బ్రహ్మానందం, నటులు 30 ఇయర్స్ ఇండస్ట్రీస్ పృద్వి, గౌతమ్ రాజు, శ్రీనివాసులు,తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి కనుమూరి రాజ్యలక్ష్మి ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డు ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు పమిడిపల్లి అనిల్ రాజ్ మరియు ఉపాధ్యక్షులు గుమ్మడి మనోహర్ బాబు కి అందచేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ మాట్లాడుతూ. గత కొన్ని సంవత్సరంలుగా నిస్వార్ధంగా మేము చేస్తున్న సేవలను గుర్తించి విశ్వజనని ఫౌండేషన్ వారు అవార్డు తో పాటు ఘనంగా సత్కారం, సన్మానం ప్రముఖుల చేతుల మీదుగా తీసుకోవటం హర్షం వ్యక్తం చేస్తూ, మా పై మరింత బాధ్యత పెరిగిందని భవిష్యత్ లో ఇలాంటి సేవ కార్యక్రమాలను కొనసాగిస్తానని అయన తెలియచేసారు. అవార్డు అందుకున్న వారిని వినుకొండ లోని ప్రముఖులు, సేవ తత్పరులు అభినందించారు. (Story:యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కు సేవ రత్న పురస్కారం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!