పోలీసు వాహనాల పార్కింగ్ షెడ్ నిర్మాణం పనులు పరిశీలించిన జిల్లా ఎస్పీ
న్యూస్‌తెలుగు/వనపర్తి : సోమవారం వనపర్తి జిల్లా సాయుధ దళ పోలీస్ కార్యాలయం ప్రక్కన పోలీసు వాహనాల నిల్వ, సంరక్షణ కోసం నిర్మిస్తున్న పార్కింగ్ షెడ్ పనులను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ షెడ్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, అధికారులతో సమగ్ర చర్చ నిర్వహించారు. వాహనాల సౌకర్యవంతమైన పార్కింగ్, భద్రతా ప్రమాణాలు, మరియు వర్షాకాలంలో రక్షణపై తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ .. పోలీసు సిబ్బంది సమయానికి, సమర్థంగా ప్రజలకు సేవ చేయాలంటే వారికి మౌలిక వసతులు ఉండాలి. వాహనాల సంరక్షణ, భద్రతకు అనువైన పార్కింగ్ షెడ్ నిర్మాణం పోలీస్ శాఖ ఆధునీకరణ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ప్రతి సిబ్బంది సౌకర్యం, భద్రత మా బాధ్యత. పోలీస్ శాఖ అభివృద్ధి అంటే ప్రజా సేవకు బలమైన పునాదని.పోలీసు శాఖలో సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడం మా ప్రధాన లక్ష్యం. వాహనాల సంరక్షణ, భద్రతా ప్రమాణాలు, మరియు సమయానికి మరమ్మత్తులు జరగడం వలన విధుల్లో ప్రతిస్పందన వేగం పెరుగుతుంది. ఆధునిక సౌకర్యాలతో వాహనాల షెడ్ నిర్మాణం వల్ల సిబ్బందికి పని భారం తగ్గి, ఆపరేషనల్ సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపుఎస్పీ, వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. (Story:పోలీసు వాహనాల పార్కింగ్ షెడ్ నిర్మాణం పనులు పరిశీలించిన జిల్లా ఎస్పీ)

