ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించండి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్ తో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజావాణి సహా సీఎం ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదు లు, సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈరోజు ప్రజావాణికి మొత్తం 38 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.(Story:ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించండి)

