పిల్లి ప్రకాశ రావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది
మోరంపూడి
న్యూస్ తెలుగు /చాట్రాయి : టీడీపీ కార్యదర్శి పిల్లి ప్రకాశరావు ఆకస్మిక మరణం చనుబండ గ్రామ తెలుగు దేశం పార్టీ కి ఒక పెద్ద లోటు అని తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం చనుబండ శివారు కరుణాపురం గ్రామంలో దివంగత పిల్లి ప్రకాశరావు దశ దిన కర్మకు నక్కా రాము, గవర వెంకటేశ్వర రావు, బన్నే వెంకటేశ్వర రావు లతో కలిసి స్వర్గీయ ప్రకాశరావు చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రకాశరావు భార్యకు మోరంపూడి రూ:5000/లు ఆర్థిక సహాయం చేసారు. గ్రామ తెలుగు దేశం పార్టీ దివంగత పిల్లి ప్రకాశరావు కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. (Story:పిల్లి ప్రకాశ రావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది)

