Homeవార్తలుతెలంగాణబాల్య వివాహాలు చేస్తే చట్టరీత్య కేసులు

బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్య కేసులు

బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్య కేసులు

న్యూస్‌తెలుగు/వనపర్తి : బాల్య వివాహాలు చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి పై చట్టరీత్య కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు. అమ్మాయిలు 18 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే వరకు వారిని ఖచ్చితంగా చదివించాలని, చదువులు పూర్తి అయ్యక తనంతట తాను నిర్ణయాలు తీసుకొనే దశకు వచ్చినపుడు సంతోషంగా వివాహం జరిపించుకోవచ్చని అలాకాకుండ 18 సంవత్సరాల లోపే పెళ్ళి చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. బాల్య వివాహ నిషేధ చట్టం- 2006 ప్రకారంగా అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాల వయస్సు నిండకుండా పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరం అవుతుందన్నారు. ఈ చట్టం ప్రకారం బాల్య వివాహానికి అనుమతినిచ్చినా, ప్రోత్సహించిన, వివాహాన్ని నిర్వహించినా, బాల్య వివాహానికి హాజరైన వారందరినీ నిందితులు గానే పరిగణింపబడతారు. ఇట్టి నేరానికి *బాల్యవివాహా నిషేధ చట్టం 2006 సెక్షన్స్ 9,10,11(1) మరియు 13(10) ప్రకారం గరిష్టంగా” 2 సంవత్సరాల “జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా” లేదా రెండు విధించబడతాయి మరియు ఇది “నాన్ బెయిలబుల్ నేరమనీ తెలియజేశారు.
బాల్య వివాహాలను అరికట్టడానికి చట్టం ప్రకారం
గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ
జిల్లాస్థాయిలో-జిల్లా కలెక్టర్, డివిజనల్ స్థాయిలో-ఆర్డీవో /సబ్ కలెక్టర్, ప్రాజెక్టు స్థాయిలో సిడిపిఓ,
మండల స్థాయిలో-తహసిల్దార్, సెక్టార్ స్థాయిలో సూపర్వైజర్, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి/వీఆర్వో *బాలల వివాహా నిషేధ అధికారులు (సి.ఎం.పి.వో)Child Marriage Prohibition Officers) గా వ్యవహరిస్తారని తెలిపారు.ఎక్కడైనా బాల్య వివాహం జరిపించడానికి ప్రయత్నం చేసినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా చైల్డ్ లైన్ 1098 లేదా 100 పోలీస్ కు ఫోన్ చేసి తెలియచేయాలని సూచించారు. ఇటీవల ఘనపూర్ మండలం, వెంకటం పల్లి గ్రామంలో బాల్య వివాహాన్ని అడ్డుకొని అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రుల పైన, ఫంక్షన్ హాల్ యజమాని పైన, పెళ్ళిచేయడానికి వచ్చిన పూజారి పైన సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, కుల పెద్దలు, పూజారులు ప్రతి ఒక్కరు బాల్య వివాహాలకు మద్దతు ఇవ్వవద్దని, చట్టాన్ని అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేసి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. (Story:బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్య కేసులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!