రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి కి ఆర్ధిక సాయం..
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్ లోని ఇవాళంజికల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్ధం నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణానికి రోటరీ క్లబ్ వారు ఆర్ధికంగా తమవంతు సహకారాన్ని అందించారు. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ కార్యవర్గం నిర్మాణాల ప్రదేశాన్ని సందర్శించి పనుల యొక్క ప్రగతిని సమీక్షించారు. ఒక నెలలోపు పనులు పూర్తి చేసి భక్తుల వినియోగం లోకి తేవాలని సంకల్పించినట్లు చర్చి బాధ్యులు చాట్ల రామయ్య రోటరీ బృందానికి తెలిపారు. నిర్మాణ వ్యయంలో పాలుపంచుకుంటున్న రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాన దాతలు మాజీ రోటరీ అధ్యక్షులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి , క్లబ్ రోటరీ ఫౌండేషన్ డైరెక్టర్ మస్తాన్ కాగా మరియు ఇతర సభ్యులు కొంతమంది సహకారం అందించారు . ఈ కార్యక్రమాలలో రోటరీ అధ్యక్షులు యేరువ వెంకట నారాయణ, కార్యదర్శి బాజీ , రోటరీ జిల్లా ముఖ్యులు ఆలా శ్రీనివాసరావు , చిరుమామిళ్ల కోటేశ్వరరావు , క్లబ్ సర్వీసెస్ డైరెక్టర్ నాగేంద్రుడు మాష్టారు , క్లబ్ యూత్ సర్వీసెస్ డైరెక్టర్ గుత్తా గురునాధం , మాజీ కోశాధికారి నాయబ్ రసూల్ , క్లబ్ సభ్యులు దావులూరి శ్రీనివాసరావు , గుమ్మా అంజిరెడ్డి చర్చి పెద్దలు పాల్గొన్నారు. (Story:రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి కి ఆర్ధిక సాయం..)

