కార్యకర్తను పరామర్శించిన వైసీపీ నేతలు..
న్యూస్ తెలుగు/ వినుకొండ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పల్నాడు జిల్లా నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వినుకొండలో జరిగిన ఒక వివాహ వేడుకలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం దారుణమని, చిన్న చిన్న సంఘటనలకు కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు పోలీసు చేయటం వారి నిర్బంధం లో రాత్రి మొత్తం ఉంచుకొని చిత్రహింసలకు గురి చేసినారు. పోలీసు వారు విచక్షణారహితంగా జాబీర్ కంటి పైన కూడా గాయం చేసినారు.. రాజ్యాంగానికి విలువలు లేకుండా బెయిల్ పొందినటువంటి వ్యక్తులను కక్షపూరితంగా తమ నిర్బంధంలో ఉంచుకోవడం ఎంతవరకు సబబు శనివారం హైకోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నప్పటికీ, వైఎస్సార్సీపీ కార్యకర్త జాబీర్‌పై పోలీసులు దారుణంగా దాడి చేయడం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై స్పందించిన ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం. ఎన్ ప్రసాద్ , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి , జిల్లా ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షుడు పి. ఎస్ ఖాన్ , వినుకొండ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు గౌస్ భాషా, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్వలి, అత్తర్ నాగూర్, కౌన్సిలర్లు గౌస్ భాషా, రఫీ, జిల్లా నాయకులు ఖాదర్, వైసీపీ యువ నాయకులు జాబీర్‌ను పరామర్శించారు. (Story:కార్యకర్తను పరామర్శించిన వైసీపీ నేతలు..)

