పొంగి పొర్లుతున్న సింగర చెరువును సందర్శించిన ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : తుఫాన్ ప్రభావంతో పట్టణానికి త్రాగునీరు అందించే సింగర్ చెరువు నిండి పొంగి పొర్లుతుంది. బుధవారం ఉదయం ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అధికారులతో సింగర చెరువును కలిసి పరిశీలించారు. చెరువు కట్టలను, చెరువులోకి నీరు చేరే తీరును పరిశీలించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద నీరు చెరువులోకి చేరకుండా పక్కకు మళ్లించి, చెరువు కట్టలు బలహీన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.(Story : పొంగి పొర్లుతున్న సింగర చెరువును సందర్శించిన ప్రభుత్వ )

