సి ఆర్ డి ఏ అధికారులతో కలిసి ఎన్ఎస్పి స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణములోని నరసరావుపేట రోడ్డులో గల 22 ఎకరాల ఎన్ఎస్పి స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సి ఆర్ డి ఏ అధికారులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గురువారం స్థలం పరిశీలించారు. మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్, ప్రభుత్వ కార్యాలయాలు, స్టేడియం, తదితర భవన నిర్మాణాలకు స్థలం కేటాయింపు పై అధికారులు చీఫ్ విప్ జీవి తో చర్చించారు. ఎన్ఎస్పి స్థలం అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి త్వరలో నిర్మాణ పనులు చేపట్టేందుకు చీఫ్ విప్ జీవి అంచనాలతో ప్రణాళిక సిద్ధం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.(Story : సి ఆర్ డి ఏ అధికారులతో కలిసి ఎన్ఎస్పి స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ )

