స్కూల్ గేమ్స్ లో ప్రతిభ కనబరిచిన శర్మ స్కూల్ విద్యార్థులు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డు లోని ఎన్ఎస్పి జడ్పీ హైస్కూల్ నందు స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఆటల పోటీలలో శర్మ స్కూల్ విద్యార్థులు డివిజనల్ స్థాయి కి ఎంపిక అయ్యారని ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అండర్ 14 కబడ్డి లో లక్ష్మి, నిత్య, చెర్రీ మరియు బాలుర విభాగంలో శేషు,రాజు, అండర్-14 చెస్ విభాగం లో ముబిద్,భవ్య ఎంపికయ్యారని తెలిపారు. విద్యార్థులకు క్రీడలలో శిక్షణ ఇస్తున్న పీడీ వంశీ ని అభినందించారు. ఈ అభినందన సభలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులను మరియు వారికి శిక్షణ ఇచ్చిన పీడీ ని అభినదించారు.(Story : స్కూల్ గేమ్స్ లో ప్రతిభ కనబరిచిన శర్మ స్కూల్ విద్యార్థులు )

