సమస్యల పరిష్కారానికి గాంధీ విగ్రహం వద్ద వినతి పత్రం
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని, సమస్యల పరిష్కారానికి నవంబర్ 3వ తారీకు నుండి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెలోకి వెళ్తున్నారని, అందులో భాగంగా దశల వారి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నామని, అందులో భాగంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో మహాత్మా గాంధీ విగ్రహాలకు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నరసరావుపేట రోడ్ లో పెట్రోల్ బంకు పక్కన ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా బూదాల మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల చిన్నచూపు చూస్తుందని, గత రెండు సంవత్సరాలుగా మునిసిపాలిటీలో మరణించిన కార్మికుల స్థానంలో వారి పిల్లల్ని గాని, వారి భార్యను గాని నియమించటంలో విఫలం చెందిందని, మరణించిన కార్మికులు కుటుంబీకులకు వెంటనే ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు నియమకాలు జరగాలని, 12 పి ఆర్ సి ప్రకటించి 30% మధ్యంతర భృతి అయ్యార్ ఇవ్వాలని, పర్మిట్ కార్మికులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా డైలీ వేజ్ కార్మికులను హౌస్పోర్సింగ్ రంగంలోకి తీసుకోవాలని హౌస్ కోచింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల పదవి విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులకు మున్సిపాలిటీలో కాలనీ నిర్మించి ఇవ్వాలని, బదిలీ కార్మికులను పూర్తి కాలపు కార్మికులుగా కొనసాగించాలని, ఈ సమస్యలు పరిష్కారం కోసం నవంబర్ 2వ తారీకు వరకు దశల వారి నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సమస్యలను పరిష్కరించినట్లయితే సమ్మె చేసేంతవరకు వెళ్ళనీకుండా ప్రభుత్వం సహకరించాలని, లేనిపక్షంలో నవంబర్ 3వ తారీకు నుండి సమ్మెలోకి వెళ్తామని బూదాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ సీనియర్ నాయకులు సంపెంగల అబ్రహం రాజు, సాయి, కంచర్ల కోటేశ్వరావు, మార్తమ్మ, కొండమ్మ, ఏసు, మరియమ్మ, కొప్పురపు మల్లికార్జున, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.(Story : సమస్యల పరిష్కారానికి గాంధీ విగ్రహం వద్ద వినతి పత్రం )

