Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ

వినుకొండ వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ

వినుకొండ వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడే కష్టాలను, బాధలను ఈ డిజిటల్ బుక్ లో పొందుపరచవచ్చు అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను, కూటమి ప్రభుత్వం నాయకులు, అధికారులు పెట్టే ఇబ్బందులను ఈ డిజిటల్ బుక్ లో పందుపరిస్తే జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ట్రాన్స్ఫర్ లేదా రిటైర్డ్ అయిన సరే వదిలే ప్రసక్తి లేకుండా న్యాయపరంగా శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవటానికి ఈ డిజిటల్ బుక్ ఎంతగానో దోహదపడుతుందని బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. కూటమి నాయకుల అన్యాయాలకు, అక్రమాలకు గురైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన ఈ డిజిటల్ బుక్ ద్వారా వైయస్ జగన్మోహన్ రెడ్డి కి చేరుతుందని, ఇది జగనన్న మనకు ఇచ్చిన ఒక రక్ష అని అన్నారు. (Story:వినుకొండ వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!