Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌తెలుగు శాస్త్రవేత్తకు జాతీయ పురస్కారం

తెలుగు శాస్త్రవేత్తకు జాతీయ పురస్కారం

తెలుగు శాస్త్రవేత్తకు జాతీయ పురస్కారం

సాలూరు వాసి సంగంరెడ్డి.శ్యామ్ కుమార్ కు 2024-25 జాతీయ భూగోళ శాస్త్ర పురస్కారం

న్యూస్ తెలుగు/సాలూరు : భారత జాతీయ భూగోళ పరిశోధన సంస్థ లో భూగోళ శాస్త్రవేత్తగా సేవలందిస్తున్న తెలుగు శాస్త్రవేత్త శ్రీ ఎస్. శ్యాం కుమార్ 2024-25 సంవత్సరానికి గానూ జాతీయ భూగోళ శాస్త్ర పురస్కారం లభించింది. దేశవ్యాప్తంగా భూగోళ పరిశోధనలందించిన వారికి ప్రదానం చేసే ఈ ప్రతిష్టాత్మక బహుమతి, శాస్త్రరంగంలో అత్యున్నత గౌరవాల్లో ఒకటిగా పేరుగాంచింది. భారత భూగోళ పరిశోధన సంస్థ (జీఎస్ఐ) మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ భూగోళ శాస్త్రవేత్తలుగా సేవలందిస్తున్న బృందానికి 2024- 2025 సంవత్సరానికి ఈ పురస్కారం దక్కింది. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదగా ఎవర్నో ఆయన అందుకున్నారు.ఒడిశా రాష్ట్రంలో ఆయన చేసిన ఖనిజ అన్వేషణలు ఈ గౌరవానికి నాంది అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి కాపర్ నిక్కల్ గోల్డ్ కాబేల్ట్ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ఖనిజాల గుర్తింపులో ఆయన చూపిన ప్రతిభ ప్రాధాన్యత సాధించింది. రక్షణ, హరితశక్తి, పరిశ్రమల అభివృద్ధికి అత్యంత అవసరమైన ఈ ఖనిజాల లభ్యత ద్వారా దేశ ఆర్థిక రంగానికే శక్తి ఆధారిత విధానాలకు కూడా బలమైన మద్దతు లభించనుంది.
శ్యాం కుమార్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి జియాలజీలో పీజీ పూర్తి చేశారు. ఆధునిక భూభౌగోళిక సాంకేతికతలో ఆయనకు ఉన్న అనుభవం, పరిశోధన పట్ల చూపిన ఆసక్తి ఆయన్ను ఈ స్థాయికి చేర్చినవిగా పరిశోధనావర్గాలు చెబుతున్నాయి. రాజధాని ఢిల్లీలో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందని కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వర్గాలు తెలిపాయి. తెలుగు శాస్త్రవేత్తకు దేశస్థాయిలో లభిస్తున్న ఈ గౌరవం తెలుగు ప్రజలకు గర్వకారణంగా మారింది, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు నియోజకవర్గ ప్రజలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు . (Story:తెలుగు శాస్త్రవేత్తకు జాతీయ పురస్కారం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!