తెలంగాణ రైతాంగా విప్లవ అగ్ని చాకలి ఐలమ్మ
న్యూస్ తెలుగు/వనపర్తి : చిట్యాల(చాకలి).ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో బి.ఆర్.ఎస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన తొలి వీరవనిత చిట్యాల.ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ రైతాంగా విప్లవ అగ్నిగా రగిలి నిజాం సైన్యాన్ని గడగడలాంచి తెలంగాణ విముక్తి కోసం అంకురార్పణ చేశారని ఐలమ్మ ఆశయాలు సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో గంధం.పరంజ్యోతి,ఉంగ్లం. తిరుమల్,నాగన్న యాదవ్,సూర్యవంశం.గిరి,హేమంత్ ముదిరాజ్, సునీల్ వాల్మీకి,జోహెబ్ హుస్సేన్,వజ్రాల.రమేష్, ఉస్మాన్ పాషా,రాజు తదితరులు పాల్గొన్నారు.(Story :తెలంగాణ రైతాంగా విప్లవ అగ్ని చాకలి ఐలమ్మ )

