ఆధునిక వ్యవసాయ పద్ధతిలో అధిక దిగుబడులు

న్యూస్ తెలుగు/సాలూరు : ఆధునిక వ్యవసాయ పద్ధతిలో రైతులు డ్రోన్లు ద్వారా రసాయనిక ఏరువులు, పురుగుమందులు పిచికారి చేసినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చునని సాలూరు వ్యవసాయ అధికారి కే శిరీష అన్నారు. శుక్రవారం సాలూరు మండలం కురుకుట్టి మరియ తోణం రైతుసేవ కేంద్రాల పరిధిలో కురుకుట్టి పంచాయతీ పరిధిలో గల గుడ్డంగానివలస,బొర్రమామిడి వలస గ్రామాలలో పొలం పిలుస్తుంది మరియు జాతీయ ఆహార భద్రత అను వ్యవసాయ కార్యక్రమం లు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులందరూ ఈ నెలాఖరు లోపు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు, అలానే నత్రజని రసాయనిక ఎరువు అయిన యూరియా ను నానో యూరియా రూపంలో పంటలకు వినియోగించడం వలన పంటలకు తగిన మోతాదులో నత్రజని అందడమే కాకుండా నత్రజని రసాయనిక ఎరువుల వలన భూమి మరియు గాలి కలుషిత ప్రభావం కూడా తగ్గుతుందని తెలియచేశారు. వరి పంట లో ప్రస్తుతం ఆకు చుట్టు పురుగు అక్కడక్కడ కనిపిస్తుందని పురుగు నివారణ కోసం తొలిదశలో వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలని తెలియచేశారు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కార్టప్ హైడ్రోక్లోరైడ్ 2gm ఒక లీటర్ నీటి కి పిచికారీ చేయాలని తెలియచేశారు ,తదుపరి ఆధునిక వ్యవసాయ పద్దతులు రైతులకు పరిచయం చేసే పనిలో భాగంగా డ్రోన్ ద్వారా రసాయనిక ఎరువుల మరియు పురుగు మందుల పిచికారీ గురించి వివరించడం జరిగింది. అలానే చిరుధాన్యాలు లో ఒకటి అయిన రాగి పంట యాజమాన్యం మరియు రాగి పంటకు వచ్చే తెగుళ్లు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో, గ్రామ పెద్దలు రైతులు , సిబ్బంది పాల్గొనడం జరిగింది. (Story:ఆధునిక వ్యవసాయ పద్ధతిలో అధిక దిగుబడులు)

