Homeవార్తలుతెలంగాణ12 ఏళ్ల సమస్యను ప్రజావాణితో చిన్నారెడ్డి ప్రత్యేక చోరవతో పరిష్కారం

12 ఏళ్ల సమస్యను ప్రజావాణితో చిన్నారెడ్డి ప్రత్యేక చోరవతో పరిష్కారం

12 ఏళ్ల సమస్యను ప్రజావాణితో చిన్నారెడ్డి ప్రత్యేక చోరవతో పరిష్కారం

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : శ్రీరంగాపూర్ మండలం నాగరాల గ్రామానికి చెందిన గుంటి బాలక్రిష్ణ నివాస స్థల పట్టా కోసం 12 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన నివాసస్థల పట్టా ఇవ్వలేదు. గ్రామ నాయకులు ఎవరూ సహకరించలేదు. ప్రభుత్వ కార్యాలయల చుట్టూ తిరగడం తప్ప సమస్యను ప్రభుత్వ అధికారులు పరిష్కరించిన దాఖలాలు లేవు అని తెలిపారు .ఆఖరి ప్రయత్నం గా మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో ప్రజావాణి లో తన సమస్యను తెలుపగా ప్రజావాణి ఇంచార్జ్ , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారి ప్రత్యేక చొరవతో గుంటి బాలక్రిష్ణ నివాస స్థల పట్టా ఇవ్వడం జరిగింది. గుంటి బాలక్రిష్ణ గారు తన 12 ఏళ్ల సమస్య పరిష్కారం అయినా సందర్భంగా గుంటి బాలక్రిష్ణ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారిని శాలువాతో సన్మానించి ,కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.(Story:12 ఏళ్ల సమస్యను ప్రజావాణితో చిన్నారెడ్డి ప్రత్యేక చోరవతో పరిష్కారం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!