వైద్య ఖర్చు నిమిత్తం ఎల్ఓసిలు అందజేసిన జీవీ..
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ మండలం విఠంరాజు పల్లి గ్రామానికి చెందిన వజ్రాల రామకృష్ణారెడ్డి , కోరాకుల మల్లేశ్వరి లకు ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ఎల్ఓసి పత్రాలను ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు బుధవారం అందజేశారు. రామకృష్ణారెడ్డి, మల్లేశ్వరి కుమార్తె కు ఆనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆపరేషన్ నిమిత్తం డబ్బు లేక పడుతున్న ఇబ్బందులను కుటుంబ సభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఇరువురికి 17 లక్షల 50 వేలు ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ వో సి లు మంజూరు చేయించి బుధవారం అమరావతిలోని చీఫ్ విప్ ఛాంబర్ లో జీవి ఆంజనేయులు చేతుల మీదగా ఎల్ఓసి పత్రాలను అందజేశారు.(Story:వైద్య ఖర్చు నిమిత్తం ఎల్ఓసిలు అందజేసిన జీవీ..)

