స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ద్వారా విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
న్యూస్ తెలుగు /చింతూరు : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళా సాధికారత విభాగం మరియు జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో, స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వారి సహకారంతో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.రత్న మాణిక్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరీటెండెంట్ డాక్టర్ ఎమ్ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, సమాజo ఆరోగ్యంగా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో సుమారు వందమంది విద్యార్థినీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఐరన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించుటకు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సిబ్బంది సిహెచ్.కార్తీక్ (యల్ టీ), పి. భవాని(యల్ టీ), కె.రామశేఖర్ (యల్ టీ),ఎమ్. అమ్మాజీ(యల్ టీ) మరియు డిగ్రీ కళాశాల అధ్యాపకులు , విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story:స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ద్వారా విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు)

