శాస్త్రియ తార్కిక దృక్పధంలో బోధన జరగాలి
విద్యా వ్యవస్థలో మార్పులు అనివార్యం
ఎయిమ్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ కుమార్
వినుకొండ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సెమినార్
న్యూస్ తెలుగు/వినుకొండ : విద్యార్థి దశ నుంచే చారిత్రక, భౌగోళిక, పరిపాలన అంశాలు శాస్త్రీయ, తార్కిక పద్ధతుల్లోనే బోధించాలనిఎయిమ్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కె. విజయ్ కుమార్ సూచించారు. భూగోళం పుట్టక, చరిత్ర గమనము, మానవుడి పరిణామ క్రమంలో వచ్చిన యదార్ధాలు భావి తరాలకు తెలియాలంటే విద్యా వ్యవస్థలో మార్పులు అణివార్యమని ఆయన పేర్కొన్నారు.వినుకొండ విద్యావంతుల వేదిక (వి. వే. క ) ఆధ్వర్యంలో స్థానిక ఎన్ జి ఓ హోమ్ లో ఆదివారం నిర్వహించిన సదస్సుకు డాక్టర్ విజయ్ కుమార్ ప్రధాన వక్త గా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్రానికి పూర్వం ఉన్న గురుకుల విద్యా బోధన రాజరికపు కట్టుబాట్లుకు, లార్డు మెకాలే విద్యా విధానం వంటివి బ్రిటీష్ పాలకుల పాలనా సౌలభ్యం కోసం జరిగాయాని తెలిపారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత శాస్త్ర, సాంకేతిక విద్యా బోధన సర్వత్రికం అయిందిని తెలిపారు.మన దేశంలో తయారైన శాస్త్రవేత్తలను విదేశాలకి పంపుతున్నామని ఈ విధానం వల్లనే అమెరికా, చైనా వంటి దేశాలు అన్నీ రంగాల్లో ముందున్నాయని తెలిపారు. చైనా మాత్రం తమ సైన్టిస్టులు, నిపుణులను తమ దేశ శక్తి సామర్థ్యం పెంపు కోసం వాడుకొని బలమైన దేశం గా మారి అమెరికా కి సవాల్ విసురుతుందన్నారు. ఇండియా నుంచి వచ్చిన ఉద్యోగులను తిరిగి పంపాలని అమెరికా, యూరప్ దేశాలు భావిస్తున్నాయని ఇప్పటికైనా భారత దేశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బలీయ శక్తిగా మారాలని ఆ దిశగా మన పాలకులు ఆలోచించాలని సూచించారు.ఉత్పదాకత లేని అభివృద్ధి ఎక్కువకాలం నిలువదన్న వాస్తవం ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందన్నారు. శాస్త్ర సాంకేతిక విద్య నేర్చుకోనిదే లేనిదే అభివృద్ధి సాధ్యం కాదని,వనరులు సరిగా వాడుకుంటే దేశంలో నిరుద్యోగం మాటే వినపడకుండా చేయొచన్నారు. బోధనా రంగంలో మార్పులు అనివార్యతను ప్రభుత్వాలు, పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్బంగా ప్రపంచ గమనాన్ని, దేశాల పోకడలను వివరించారు. సెమినార్ నిర్వహణ అధ్యక్షునికి సీనియర్ న్యాయవాది పీజే లూకా, పర్యవేక్షకునిగా సీనియర్ నాయవాది మూర్తి వ్యవహరించగా, మునిసిపల్ కౌన్సిలర్ షకీలా, విద్యా వంతుల వేదిక సభ్యులు విజయ్ కుమార్, పిడుగు విజయ్, ఎం ఏ సాలార్, తెల్లమేకల శ్రీనివాసరావు, భాష, మస్తాన్ వలి, వహీదా, రామాచారి, సత్తార్, పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.(Story : శాస్త్రియ తార్కిక దృక్పధంలో బోధన జరగాలి )

