Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి:  జివీ

సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి:  జివీ

సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి:  జివీ

న్యూస్ తెలుగు /వినుకొండ :రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలుపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. మంగళవారం చీఫ్ విప్ కార్యాలయంలో మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సూపర్ సిక్స్ సక్సెస్ కావడంలో కీలక పథకమైన “స్త్రీ శక్తి” ఉచిత బస్సు సౌకర్యం పథకం సూపర్ సక్సెస్ అయిందన్నారు. దీనిలో తమ వంతు గా సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలపడానికి నియోజకవర్గస్థాయిలో మహిళలతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని మహిళలు సభను జయప్రదం చేయాలని కోరారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పట్ల అన్ని ప్రాంతాల్లో ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని, మెప్మా, వెలుగు సిబ్బంది ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ పథకాలు అమలు తీసుకువెళ్లాలని కోరారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. నేడు రాష్ట్రంలో రైతులతోపాటు మహిళలు, యువత, కార్మికులు పెద్ద ఎత్తున వర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నియోజవర్గంలోని ప్రతి మహిళ ప్రభుత్వానికి అండగా నిలబడి స్త్రీ శక్తి బహిరంగ సభను విజయవంతం చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో మెప్మా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story:సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి:  జివీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!