Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఘ‌నంగా నివాళి

వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఘ‌నంగా నివాళి

వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఘ‌నంగా నివాళి

న్యూస్ తెలుగు /సాలూరు : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అమరుడైన ఆయన పథకాలు నేటికీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయని ఆయనకు మరణం లేదని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వయజిరీ కమిటీ సభ్యులు ఫీడిక రాజన్న దొర అన్నారు. బుధవారం వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సాలూరు బోసు బొమ్మ జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. ఆయన కాలంలో రైతులకు ఉచిత విద్యుత్, జల యజ్ఞం తో భారీప్రాజెక్టులు నిర్మాణం, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీ మెంబర్స్ మెంట్, 108,104 ఇలా ఆయన కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో అధికారంలో పస్తే రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి 57 వేల కోట్లు ఉన్న రుణాలను కేవలం 15 వేలు కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేశారని అన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాలుగు లక్షల 50 వేల మంది దివ్యాంగులకు, వృద్ధులు పెన్షన్లు రద్దు చేశారని అన్నారు. జగన్ అమలు చేసిన పథకాలన్నీ ఈ కుటమీ ప్రభుత్వంలో కొన్ని పథకాలు రద్దు చేశారని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆచరణ కానీ హామీలను ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదని అన్నారు. నిరుద్యోగ భృతి ,ఆడబిడ్డ నిధి, ఇలా ఎన్నో హామీ ఇచ్చారని ఆ హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రతినెల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త పెన్షన్ ఇచ్చినట్లు ఇచ్చిన పాత పెన్షన్ లే ఇవ్వడానికి వెళ్లి వందలాది కోట్ల రూపాయలు ప్రజాదాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడని చెప్పిన ఈ పెద్దమనిషి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం నాలుగున్నర నెలలో సుమారు రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతులుకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతు భరోసా కేంద్రంలో లభించాలయని , ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారయ్యిందని అన్నారు, గణపతి బప్పా మోరియా ఏదయ్యా యూరియా అని సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వంపై విమర్శలు చేసిన కనీసం పట్టించుకోకుండా రైతులకు యూరియా ఇవ్వకుండ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ నేను మీ అభిమానిని అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా అని చెప్పి నీవు రాజకీయాల్లోకి వచ్చావు ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తూ ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని నీ ప్రశ్నించడం ఏమైందని అన్నారు. గత ప్రభుత్వంలో మక్కువ రోడ్డు బాగే లేదని చెప్పిన స్థానిక మంత్రి సంధ్యారాణి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు మరమ్మత్తులు చేపడతామని చెప్పి సంవత్సరం నాలుగు నెలలు అవుతున్న మక్కువ రోడ్డు ఇప్పుడు వరకు ఎందుకు పూర్తి చేయలేదని తెలిపారు. గుంతలుగా ఏర్పడిన నియోజకవర్గంలో రోడ్లు మక్కువ రోడ్డు ఎప్పుడు పూర్తి చేస్తారో అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అవినీతి పెరిగిపోయిందని మీ సొంత పత్రిక ఆంధ్రజ్యోతిలోనే వచ్చిందని ఇప్పుడు వరకు అవినీతి చేసిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు. సాలూరు మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీను, కౌన్సిలర్లు గొర్లె జగన్మోహన్ రావు గిరి రఘు, సింగారపు ఈశ్వరరావు, వైసిపి నాయకులు దండి శ్రీనివాసరావు, డోల బాబ్జి, పాచిపెంట చినబాబు, గొర్ల మధు, కొల్లు వెంకటరమణ, జన్ని సీతారాం, వైయస్సార్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసిలు వైయస్సార్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఘ‌నంగా నివాళి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!