ఇండ్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం
న్యూస్ తెలుగు/వనపర్తి : పానగల్ మండలం తెల్ల రాళ్లపల్లిలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించకుండా అన్యాయం చేశారని సిపిఐ జిల్లా కౌన్సిల్ మాజీ సభ్యుడు, మండల మాజీ కార్యదర్శి, మాజీ ఉపసర్పంచ్ కాకం బాలస్వామి అన్నారు. గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి విడతలో 16 ఇండ్లు మంజూరు కాగా ఇల్లు లేని, ఇండ్లు పడిపోయే స్థితిలో ఉన్న అర్హులైన పేదలను ఎంపిక చేయలేదని,కొందరు అనర్హులకు కూడా ఇండ్లు మంజూరు చేశారని విమర్శించారు. ఎంపిక పారదర్శకంగా జరగలేదన్నారు. కాకం శంకరయ్య ఇల్లు పడిపోయే దశలో ఉండగా ఇల్లు మంజూరు కాలేదు అన్నారు. వర్షాలు పడ్డ ప్రతిసారి పానుగల్ ఎస్సైఇల్లు పడిపోతుందని వారికి వేరేచోట షెల్టర్ ఏర్పాటు చేశారని అలాంటి వారికి కూడా ఇల్లు మంజూరు కాలేదన్నారు. అలాంటి మరికొందరూ ఉన్న వారికి కూడా ఇండ్లు ఇవ్వలేదన్నారు. గ్రామంలో పలువురు ఆసరా పింఛనుదారుల వేలిముద్రలు, ఐరిష్ కంప్యూటర్లో రికార్డు కావడం లేదని పోస్ట్ ఆఫీస్ వారు మూడు నెలలుగా పింఛన్లు ఇవ్వటం లేదని, మూడో నెల దాటితే పింఛన్ క్యాన్సిల్ కానున్నాయన్నారు. మూడేళ్ల క్రితం నుంచి భర్తను కోల్పోయిన వితంతువులు పింఛన్లకు దరఖాస్తు చేసిన ఇంతవరకు ప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు. వెంటనే మంజూరు చేయాలన్నారు. ఆసరా పింఛన్ రూ. 4000 కి పెంచుతామన్న ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలన్నారు. గ్రామంలో వాటర్ ట్యాంక్ పడిపోయే స్థితిలో ఉందని కొత్త ట్యాంక్ నిర్మించాలని కోరిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వీధుల్లో లైట్లు లేవని రోడ్ల వెంట గడ్డి పెరిగిందని రాత్రిపూట పాముల బెడద ఉందన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిపిఐ శాఖ కార్యదర్శి సహదేవుడు, పరంధాములు, శేషమ్మ, తదితరులు పాల్గొన్నారు.(Story : ఇండ్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం )

