సతీష్ యాదవ్ కు సన్మానాలు
న్యూస్ తెలుగు/వనపర్తి : వర్తక సంఘం ప్రతినిధులు, మరియు ఉపాధ్యాయులు సతీష్ యాదవ్ ఇంటికి చేరుకుని తెలంగాణ నుండి రెండు రాష్ట్రాలలో సమాజ సేవ అంశంలో డాక్టరెట్ , మరియు గిడుగు రామ్మూర్తి అవార్డు లను పొందిన ఆయనకు స్వీట్లు తినిపించి, శాలువా బొకే లతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అవార్డుల గ్రహీత సతీష్ యాదవ్ మాట్లాడుతూ నాకు అవార్డు రావడం ఒక ఎత్తు అయితే, సమాజంలో ఉండే మేధావులు, నిజాయితీపరులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నన్ను సన్మానించడం మరొక ఎత్తు అని ఇదొక మంచి సంప్రదాయము అని, సమాజం కోసం ప్రజల కోసం ప్రశ్నిస్తున్న ఐక్యవేదికను గుర్తిస్తున్నారని వ్యక్తిగా కాకుండా ఒక బాధ్యత కలిగిన ఐక్యవేదికను గుర్తించడమే సరి అయిందని చెబుతూ, ఈ సన్మానాలు నవరాత్రి ఉత్సవాల వరకే కొనసాగించాలని ప్రజా సమస్యలపై నవరాత్రి ఉత్సవాల తర్వాతనే పోరాడుతామని ఇది ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సన్మానం చేసిన వర్తక సంఘం అధ్యక్షుడు సుమన్, బచ్చు వెంకటేష్,కొండ కిషోర్,దోమ శివ, బొడ్డు శంకర్, నూకల హరి,గార వంశీ ఉపాధ్యాయులు గురు రాజ్ యాదవ్, రవీందర్ రెడ్డి, గోపాలకృష్ణ, బిసి కురుమన్న, విజేత రాములు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.(Story : సతీష్ యాదవ్ కు సన్మానాలు )

