నీళ్లను ఒడిసిపట్టి జలరాశులను పెంపొందించింది కె.సి.ఆర్
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం తిరుమలయ్య గుట్ట ఫారెస్ట్ నందు నిర్మించిన తిరుమలయ్య కుంట మరియు పెద్దగూడెం తండా ధీద్య కుంటలను మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకులు,రైతులతో కలసి సందర్శించి నిండుకుండలా నీళ్లతో నిండిన జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ హయాములో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి వృథా కాకుండా నీళ్లను ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు,కుంటలు నిర్మించి కాపాడిన ఘనత కె.సి.ఆర్ గారిది అని కొనియాడారు. తన హయాములో తిరుమలయ్య గుట్ట అటవీ ప్రాంతములో ఉన్న చిన్న కుంటను మరియు పెద్దగూడెం తండా ధీద్య కుంటను ఆధునీకరించి చెరువులను తలపించే విధంగా పునర్నిర్మించామని అన్నారు. ఈ కుంటలవల్ల చాలా ఏండ్లుగా గిరిజన రైతులు తమ సొంత పొలాలతో పాటు పోడు భూములను సాగు చేసుకొనేవారని ఆనాటి పరిస్థితులలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడేవారని ఈ కుంటల నిర్మాణంతో రైతులకు సాగునీరుతో పాటు ఆటవి జీవులకు త్రాగునీరు అవకాశం కలిగి పశు పక్షాధులకు ఈ ప్రాంతములో అభివృద్ధి చెందాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న 32మంది రైతులకు పట్టాలు ఇచ్చామని ఇంకా గుర్తించబడ్డ 62మంది రైతులు ఇంకా మిగిలారని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి కూడ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,కె.మాణిక్యం,రవిప్రకాష్ రెడ్డి, మాధవ్ రెడ్డి, నరేష్,దేవర్ల.నరసింహ,మహేశ్వర్ రెడ్డి,ధర్మా నాయక్,నారాయణ నాయక్, సునీల్ వాల్మీకి,చిట్యాల.రాము, జోహేబ్ హుస్సేన్,ఎర్వ. సాయిప్రసాద్ కొండన్న,తిరుమలయ్య,కృష్ణా నాయక్,టేక్యాచత్రూ నాయక్ నాగరాజ్, అంజి నాయుడు, బాబు నాయక్, రవి నాయక్, తదితరులు ఉన్నారు.(Story : నీళ్లను ఒడిసిపట్టి జలరాశులను పెంపొందించింది కె.సి.ఆర్)

