వినుకొండలో
ఘనంగా వాజపేయి వర్ధంతి వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి వేడుకలు వినుకొండలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయంలో ఘనంగా జరిగాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు, వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. వాజపేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన పరిపాలనా దక్షత, సుపరిపాలనతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. అలాగే, వాజపేయి గొప్ప రాజనీతిజ్ఞుడు, అద్భుతమైన వక్త, కవి అని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలతో ప్రపంచానికి భారతదేశ సత్తా ఏంటో చాటిచెప్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయుకులు తవ్వా నాగేశ్వరావు, గోళ్ల మస్తాన్ రావు, బండి వెంకటేశ్వర్లు, మూర్తియ్య, జోరేగే శ్రీనివాసరావు, పసుమర్తి శంకరరావు, గాలెమ్మ, రత్నాకర్, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:వినుకొండలో ఘనంగా వాజపేయి వర్ధంతి వేడుకలు)

