Homeవార్తలుతెలంగాణఅత్యవసర పరిస్థితులలో ప్రాణాలు నిలబెట్టాలనే లక్ష్యం నాది

అత్యవసర పరిస్థితులలో ప్రాణాలు నిలబెట్టాలనే లక్ష్యం నాది

అత్యవసర పరిస్థితులలో ప్రాణాలు నిలబెట్టాలనే లక్ష్యం నాది

న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లా కేంద్రములో క్రిటికల్ కేర్ సెంటర్ (అత్యవసర వైద్య సేవల విభాగం)నిర్మాణం,ఆధునిక పరికరాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బి.ఆర్.ఎస్ శ్రేణులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సామాన్య పేద ప్రజలకు వైద్యం అందాలన్న సదుద్దేశ్యంతో ఆనాడు కె.సి.ఆర్ గారు మండల స్థాయి,జిల్లా స్థాయి ఆసుపత్రులు అధునూతనమైన పరికరాలతో ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో నా హాయంలో 17కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ (అత్యవసర వైద్య సేవల విభాగం)అధునాతన పరికరాలతో మంజూరు చేయించాము అని అన్నారు ఇట్టి నిర్మాణం,ఎక్విప్మెంట్లు గూర్చి ఏ.ఈ సాదిక్,కాంట్రాక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నారు .దాదాపు సమకురీనాయని వారు తెలిపారు. ఈ క్రిటికల్ కేర్ సెంటర్ లో 50బెడ్సులో ఒకేసారి 50మందికి అత్యవసర వైద్య సేవలు అందుతాయి అని అదేవిధంగా 25 ఇంటెన్సివ్ కేర్ యూనిట్(I.C.U) బెడ్స్ తో వైద్యం అందిస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
టి డయాగ్నిటిక్ హబ్ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాలని 2కోట్ల 40లక్షలతో సి.టి స్కాన్ ఏర్పాటు చేశామని ఇందులో 135 పరీక్షలు నిర్వహించడానికి టి డయాగ్నటిక్ హబ్ సెంటర్ మంజూరు చేసి సేవలు అందిస్తున్నామని అన్నారు.ఇందులో 30,40పరీక్షలు నిర్వహించడం లేదని తెలిసిందని ఇట్టి విషయములో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మెరుగైన పరీక్షలు నిర్వహించాలని సూచించడం జరిగిందని అదేవిధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొరవడిన వసతుల,సేవల గూర్చి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ వ్రాస్తానని తెలిపారు.జిల్లా కేంద్రములో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(మాత శిశు సంరక్షణ కేంద్రం)ను వార్డుల వారిగా కలియ తిరుగుతూ రోగులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు సావధానంగా విని వైద్యులకు పలు సూచనలు చేశారు.
సిబ్బంది రోగులతో ఆప్యాయంగా,వినమరంగా మాట్లాడాలని పరుష పదజాలం వాడరాదని హెచ్చరించారు.
గర్భిణులు,నవజాత శిశువులను ఆప్యాయంగా పలకరించి తల్లుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పి రమేష్ గౌడ్,నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,విజయ్ కుమార్,ఉంగ్లం. తిరుమల్,నాగన్న యాదవ్,హేమంత్ ముదిరాజ్,చిట్యాల.రాము,సుగూర్.మురళి సాగర్,గులాం ఖాదర్ ఖాన్,జోహెబ్ హుస్సేన్,చిట్యాల.రాము,నీలస్వామి,స్టార్.రహీమ్,హారీఫ్,బాగ్యరాజ్,చంద్రశేఖర్,గొర్ల.ప్రేమ్ కుమార్, సూర్యవంశం.మునికుమార్,బాలరాజు,అలీం,లక్ష్మణ్ గౌడ్,శివ గౌడ్,కుమ్మరి.రామస్వామి,శిరీవాటి.శంకర్,తోట.శ్రీను తదితరులు ఉన్నారు. (Story:అత్యవసర పరిస్థితులలో ప్రాణాలు నిలబెట్టాలనే లక్ష్యం నాది)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!