Homeవార్తలుతెలంగాణప్రభుత్వం ఏఖాన(నయా పైసా)ఇవ్వకుండా ఫోటోలు ముద్రించుకోవడం సిగ్గుచేటు

ప్రభుత్వం ఏఖాన(నయా పైసా)ఇవ్వకుండా ఫోటోలు ముద్రించుకోవడం సిగ్గుచేటు

ప్రభుత్వం ఏఖాన(నయా పైసా)ఇవ్వకుండా ఫోటోలు ముద్రించుకోవడం సిగ్గుచేటు

న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సందర్శనలో భాగంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రజల అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి అంబులెన్సులు అందుబాటులో ఉండేవి కావని అనాటి పరిస్థితులలో మాజీ ఎం.పి రావుల.చంద్రశేఖర్ రెడ్డి ఒక అంబులెన్స్ సమకూర్చినారని తర్వాత తాను మంత్రిగా నియోజకవర్గంలో అన్ని మండలాలకు కొల్లాపూర్,అలంపూర్ నియోజకవర్గలలో 9అంబులెన్సులు కొన్ని సి.ఎస్.ఆర్ ఫండ్స్ ద్వారా వ్యక్తిగత సొమ్ముతో,శ్రేయోభిలాషులు,స్నేహితులు,దాతల సహకారంతో సమకూర్చడం జరిగిందని వివరించారు. తాను బాధ్యత వహించి జిల్లా ప్రజల సౌకర్యకోసం సొంతంగా,దాతల సహాయంతో ఏర్పాటు చేస్తే సర్కార్ ఏకానా(నయా పైసా)ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ల ఫోటోలు ముద్రించుకోవడం సిగ్గుచేటు అని ఘాటుగా విమర్శించారు. సర్కార్ నిధులు ఇచ్చి స్టీకర్లు అతికించుకుంటే తప్పులేదు కానీ,దాతలు,తాను,శ్రేయోభిలాషులు సమకూర్చిన అంబులెన్స్ లమీద రేవంత్ రెడ్డి గారి ఫోటోలు ముద్రించుకోవడం నిజంగా సిగ్గుచేటైన విషయం అని అన్నారు. (Story;ప్రభుత్వం ఏఖాన(నయా పైసా)ఇవ్వకుండా ఫోటోలు ముద్రించుకోవడం సిగ్గుచేటు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments