Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌డిమ్స్ కంప్యూటర్స్ 33వ వార్షికోత్సవం

డిమ్స్ కంప్యూటర్స్ 33వ వార్షికోత్సవం

డిమ్స్ కంప్యూటర్స్ 33వ వార్షికోత్సవం

న్యూస్‌తెలుగు/విజయనగరం: నేటి విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులలో శిక్షణ చాలా ముఖ్యమని అమరజీవి ఫౌండేషన్ అధ్యక్షులు ఆలవెళ్లి శేఖర్ అన్నారు. శనివారం డిమ్స్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విదేశాలలో స్థిరపడాలనే విద్యార్థులు కంప్యూటర్ విద్యలో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. ఉద్యోగాలలో స్థిరపడిన విద్యార్థులు సమాజసేవకు ముందుకు రావాలని, వారు సంపాదిoచిన జీతంలో కొంత భాగాన్ని సేవాకార్యక్రమంలకు వినియోగించాలని అన్నారు. డిమ్స్ కంప్యూటర్స్ అధినేత కె.ఎస్.బి. కె.రాజు మాట్లాడుతూ 33 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు సాధించినట్టు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు అవసరం అయ్యే అడ్వాన్స్ కోర్సులలో కూడా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఐ.ఎస్.ఓ.సర్టిఫికెట్ పొందిన ఏకైక శిక్షణ సంస్థ డిమ్స్ కంప్యూటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ భాగ్యలక్ష్మి, ఫ్యాకలిటీ సురేష్, భవాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్ ఏర్పాటు చేసిన 33 సంవత్సరంల ప్రత్యేక కేక్ ను డిమ్స్ రాజు కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. (sTORY:డిమ్స్ కంప్యూటర్స్ 33వ వార్షికోత్సవం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!