సాహితి మిత్ర బృందం వ్యవస్థాపకులు జె బి తిరుమల చార్యులు మృతి

న్యూస్ తెలుగు/ సాలూరు : సాలూరు సాహితి మిత్ర బృందం వ్యవస్థాపకులు జె బి తిరుమల చార్యులు గుండెపోటుతో మృతి చెందడం సాలూరు సాహిత్య లోకానికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు పీడిక రాజన్న దొర అన్నారు. శనివారం ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో.సాలూరు పట్టణ కవులు, రచహితలు, ఉపాధ్యాయులు సాహితీ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం అని తెలిపారు. సాలూరు సాహితీ లోకానికి ప్రత్యేక స్థానం కలిగించిన మహోన్నతమైన వ్యక్తిని అన్నారు. ప్రముఖ సాంస్కృత పండితులుగా, ఆకాశవాణి రెడీయో లో పనిచేసి కవి రత్న బిరుదు పొందారని తెలిపారు.అనేక రకములైన కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే, మరో ప్రక్క ఉపాధ్యాయ వృత్తిని దైవం గా భావించి అనేక మంది పేద విద్యార్థులకు పుస్తకాలు కొని వారిని ప్రోత్సహించేవారని అన్నారు. సామాజిక సేవలు చేసేవారని తరగతులు అయిపోయిన తర్వాత కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి పిల్లలను ఉన్నత విద్యా శిఖరాలు అధిరోహించేటట్టు చేశారని తెలియజేశారు. సాలూరు శ్రీ వెంకట విద్యాగిరి కరస్పాండెంట్ కోడూరు సాయి శ్రీనివాసరావు పాఠశాల ఆవరణంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాలూరు సాంస్కృతిక పాఠశాల, వెంకట విద్యాగిరి పాఠశాల, పట్టణంలో ఉన్న వివిధ పాఠశాలలో విద్యార్థులందరూ ఐదు నిమిషాలు పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు, పట్టణ ప్రజలు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. (Story:సాహితి మిత్ర బృందం వ్యవస్థాపకులు జె బి తిరుమల చార్యులు మృతి)

