14వ వార్డులో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు 14వార్డులో పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్ ఆధ్వర్యములో బి.ఆర్.ఎస్ శ్రేణులు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు మా వార్డులో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్,మహిళా అధ్యక్షురాలు నాగమ్మ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మోసపూరిత 420హామీలు,6గ్యారంటీలు మహిళలకు 2500,తులం బంగారం,గ్యాస్ సబ్సిడీ,మూడు విడతలుగా రైతు భరోసా,వ్యవసాయ కూలీలకు రైతు భరోసా,నిరుద్యోగ భృతి,2లక్షల ఉద్యోగాలు,ఆసరా పింఛన్లు 4000ఇస్తామని మోసం చేశారని రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. అమరుడు శ్రీకాంత్ చారి మరణం రాష్ట సాధనలో కీలకం అయిందని అమరుల ఆశయాలు సాధించాలంటే కె.సి.ఆర్ నాయకత్వంలో బి. ఆర్.ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. పట్టణములో ఎక్కడ తిరిగిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ విజయ దుందుభి మోగిస్తోంది అని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ , ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతి,మాజీ కౌన్సిలర్స్ ఉంగ్లం. తిరుమల్, నాగన్న యాదవ్,కంచె.రవి,గులాం ఖాదర్ ఖాన్,స్టార్.రహీమ్, వార్డ్ నాయకులు గోకం.శివ,గోవర్ధన చారి,గన్నోజు మోహన్,శ్యాం,నాయకులు నందిమల్ల.రమేష్,యుగంధర్ రెడ్డి,నందిమల్ల.సుబ్బు, జానం పేట.శ్రీనివాసులు,రామకృష్ణ,మాధరావ్ పల్లె.బాలరాజు,అనపటి.రాము, శిరీవాటి.శంకర్,కుమ్మరి.రామస్వామి,అలీం,మహబూబ్,ఖాదర్శ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:14వ వార్డులో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్)

