గుంటి ఆంజనేయస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి, నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం శుక్రవారం గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జి.వి. ఆంజనేయులు, డిసిసిబి చైర్మన్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, జనసేన నియోజకవర్గ సమన్వయ కర్త కొంజేటి నాగ శ్రీను రాయల్, మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ షకీల దస్తగిరి, పలువులు తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా దేవస్థానానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ రామ్మోహన్ ఆచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ. శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంను బాగా అభివృద్ధి చేసి దేవాలయం కు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. అదేవిధంగా వినుకొండ పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయటానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం దేవాలయ ఈవో పెద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ ఎన్నిక పూర్తి చేయటం జరిగింది. చైర్మన్ గా చిలంకూరి వెంకట కోటేశ్వరరావు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చిలంకూరి వెంకట కోటేశ్వరరావు మాట్లాడుతూ. దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అందరి సహాయ సహకారాలతో దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే మంచి మంచి కార్యక్రమాల నిర్వహించుకుని దేవాలయ ప్రతిష్టను పెంచే విధంగా మా కమిటీ పని చేస్తుందని అన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులుగా భాగవతుల రవికుమార్, ఖజ్జాయం విజయలక్ష్మి సుబ్బారావు, కొంజేటి లక్ష్మణరావు,రామయ్య, పాలడుగు శ్రీను, దూల్ల సుజాత, లక్ష్మి నాగరాజు, లక్ష్మీబాయి, నారాయణ ఆనందా చార్యులు కమిటీ సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. అనంతరం విచ్చేసిన పలువురు ప్రేమికులు నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు అనంతరం అందరికీ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటి ఆంజనేయ స్వామి భక్త బృందం, వాసవి క్లబ్స్ సభ్యులు, వనిత క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు విశ్వహిందూ పరిషత్ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. (Story:గుంటి ఆంజనేయస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం)

