ఎమ్మెల్యే పత్తిపాటిని కలసిన గడిపూడి
న్యూస్ తెలుగు / వినుకొండ : ఈనెల 28వ తేదీన శావల్యాపురం సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న గడిపూడి విశ్వనాథం శుక్రవారం నాడు మాజీమంత్రి ప్రస్తుత చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ను మర్యాదపూర్వకంగా కలసి తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. పత్తిపాటిని కలసిన వారిలో యార్లగడ్డ లెనిన్ కుమార్, గోరంట్ల హనుమంతరావు, గద్దె వీర మస్తాన్ రావు, తదితరులు ఉన్నారు. (Story:ఎమ్మెల్యే పత్తిపాటిని కలసిన గడిపూడి)

