Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అసంపూర్తిగా ఉన్నరోడ్లు బాగు చేయాలి

అసంపూర్తిగా ఉన్నరోడ్లు బాగు చేయాలి

అసంపూర్తిగా ఉన్నరోడ్లు బాగు చేయాలి

న్యూస్ తెలుగు /వినుకొండ : సోమవారం స్థానిక రైలు పేటలో నూతనంగా ఏర్పాటైన అర్బన్ ఆరోగ్య సెంటర్ ను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ప్రారంభించి వచ్చే క్రమంలో రైలు పేటకు చెందిన కొందరు యువకులు, మహిళలు జీవి కారును అటకాయించి తమ సమస్యను వెళ్ళబోసుకున్నారు. రైలు పేటలోని ఒకటో వీధిలో సిమెంట్ రోడ్డు పూర్తిగా వేయకుండా కొంత భాగం ఆపారని, దీంతో వర్షాకాలంలో నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, అధికారులకు ఎర్నుమార్లు చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని జీవి కి మొరపెట్టుకున్నారు. అలాగే రైలు పేట మెయిన్ రోడ్డు ప్రధమంలో సిమెంట్ రోడ్డు పాడైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహించారు. ఆ రోడ్డు మలుపులో వీధిలై టు వెలగని కారణంగా రాత్రులందు పలు ఇబ్బందులు పడుతున్నామని విద్యుత్ శాఖ తీరుపై మరింత మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే జీవి, మక్కెన కారు దిగి ఆ రెండు ప్రాంతాలను పరిశీలించారు. తక్షణం సిమెంట్ రోడ్లు సమస్య, విద్యుత్ సమస్య పరిష్కరించాలని మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దీనితో ఆందోళనకారులు శాంతించారు. (Story:అసంపూర్తిగా ఉన్నరోడ్లు బాగు చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!