Homeవార్తలుతెలంగాణడ్రగ్స్ మహమ్మారిపై పెబ్బేరు కళాశాలలో అవేర్నెస్ క్యాలెండర్ విడుదల

డ్రగ్స్ మహమ్మారిపై పెబ్బేరు కళాశాలలో అవేర్నెస్ క్యాలెండర్ విడుదల

డ్రగ్స్ మహమ్మారిపై పెబ్బేరు కళాశాలలో అవేర్నెస్ క్యాలెండర్ విడుదల

న్యూస్‌తెలుగు/ వ‌న‌ప‌ర్తి: ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేరు నందు కళాశాల అధ్యాపకులు సిబ్బంది డ్రగ్స్ మహమ్మారిపై విద్యార్థులతో కలిసి క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. పెబ్బేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కౌన్సిలర్ సి కృష్ణయ్య ,హార్ట్ ఫుల్ నెస్ ప్రోగ్రాంలోని అంశాలు, మరియు డ్రగ్స్ అవేర్నెస్ పై విద్యార్థులకు వివరించడం జరిగింది. డ్రగ్స్ యువత జీవితం నాశనం చేస్తుంది, మారక ద్రవ్యాలు జోలికి వెళ్ళకూడదని, గంజాయికి, మత్తు పదార్థాలకు, ఎవరు కూడా బానిస కాకూడదని, అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దని, కొందరు వ్యక్తులు కల్తీకల్లు (ఆల్ఫా జోలం మరియు డైజో ఫార్మ్ ) తాగుతుంటారు అలా తాగిన వారు, దానికి బానిసలైన పౌరుల బాడీ పార్ట్స్, బ్రెయిన్, హార్ట్ , లివర్, కిడ్నీస్ ,లంగ్స్ ఎలా శరీర భాగాలు చెడిపోతాయో, ఎలా కల్తీకల్లుకు బానిసలైతే ఎలా ప్రాణాలు పోతాయో విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. మంచి ఆహారం తీసుకొని, మంచి ఆరోగ్యం కాపాడుకోవాలని విద్యార్థులు తెలియజేశారు, భావి భారత పౌరులైన మీరు ఎవరు కూడా వీటి డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు అని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ కు బానిసై, గంజాయి ఇతర మత్తు పదార్థాలు, దొరికే వారి వివరాలు ఉన్న, అమ్ముతున్నారని వారి సమాచారం ఉంటే బాధ్యతాయుతమైన పౌరులుగా, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు ఫోన్ చేయాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. మంచి ఆరోగ్యం , మంచి అలవాట్లపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. డ్రగ్స్ క్యాలెండర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఓబుల్ రెడ్డి , స్టూడెంట్ కౌన్సిలర్ సి కృష్ణయ్య , అధ్యాపకులు , జ్ఞానేశ్వర్ రెడ్డి, నవీన్ కుమార్, రవీందర్ , జాకీర్ హుస్సేన్, వెంకటలక్ష్మి, శిల్ప, బోధనేతర సిబ్బంది కరుణాకర్, వెంకటేష్, మధు, వెంకట్ రాములు, వేణు, ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. (Story:డ్రగ్స్ మహమ్మారిపై పెబ్బేరు కళాశాలలో అవేర్నెస్ క్యాలెండర్ విడుదల)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!