పలు అంశాలపై ఆర్పీలతో సమావేశం
న్యూస్ తెలుగు/సాలూరు : బ్యాంకు లింకేజీ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవనోపాధిని ఏర్పాటు చేసుకుని అధిక అభివృద్ధి చెందేలా కృషి చేయాలని మోప్మా గౌరవ పథక సంచాలకుల శ్రీ జీవి చిట్టి రాజు ఆన్నారు మంగళవారం. సాలూరు పట్టణంలో ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సంవత్సరము చేయవలసిన టార్గెట్స్ అన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాల మేరకు సూర్య టార్గెట్ పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా బ్యాంకు లింకేజీ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా జీవనోపాధిని ఏర్పాటు చేసుకొని అధిక అభివృద్ధి చెందేలా చూడాలని తెలిపారు. మరియు ప్రతి సంఘానికి ఆడిట్ చేయించాలని స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగా అందరూ కూడా తడి చెత్తను పొడి చేతను వేరు చేసి హోమ్ కంపోస్టు తయారు చేసే విధంగా ప్రణాళిక వేసుకొని తెలిపారు. దానిని అనుసరించాలని కిచెన్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ కి అవగాహన కల్పించాలని అందరికీ తెలియజేయాలని అన్నారు ఈ సమావేశంలో ఎల్ హెచ్ కృష్ణ, గోవిందరావు, డిఆర్పి వెంకట్ , రమణ , పుష్ప సి ఓ లు ఆర్ పి లు డిఈఓ సీఎం ఎం హాజరయ్యారు. (Story:పలు అంశాలపై ఆర్పీలతో సమావేశం)

