సాలూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

న్యూస్ తెలుగు /సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వి ఎస్ నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ జయరాం మరొక అధికారిపై విజయవాడ ఏసీబీ కార్యాలయంలో ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదయిందని అన్నారు. ఇందులో భాగంగానే గతంలో ఆయన ఏ ఏ ప్రాంతాలలో పనిచేశారో అన్నిచోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. సాలూరు. విశాఖపట్నం, మాధవధార, శ్రీకాకుళం, నందిగాం ఆయన స్వగృహంలో తనికీలు నిర్వహించామని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు పై విజయవాడ మా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story:సాలూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు)

