Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌డిగ్రీ కాలేజీ భూమిని కాపాడండి..

డిగ్రీ కాలేజీ భూమిని కాపాడండి..

డిగ్రీ కాలేజీ భూమిని కాపాడండి..

చీఫ్ విప్ జీవికి విన్నవించిన విద్యార్థులు

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలోని శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతూ విద్యార్థి సంఘ నాయకులు, కాలేజీ విద్యార్థులు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ని ఆదివారం రాత్రి కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమి మొత్తం 38 ఎకరాలు ఉండగా కొందర భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు మహంకాళి సుబ్బారావు వివరించారు. సర్వేనెంబర్ 949 లో ఉన్న డిగ్రీ కాలేజీ భూమి 5.10 ఎకరాలను పట్టణానికి చెందిన కొందరు మాభూమి అంటూ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆ భూమిని ప్రభుత్వం వారి వద్ద నుండి తీసుకొని మరోచోట ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వటం జరిగిందని వివరించారు. ఆ వ్యక్తులు ఆ భూమిని వదిలేసి కోట్ల రూపాయలు విలువగల ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని తీసుకునేందుకు ప్రయత్నిస్తూ అధికారులను ఒత్తిడి చేయడం, రెవెన్యూ అధికారులు వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ 22(1) ప్రభుత్వ నిషేధిత భూముల జాబితాలో ఉన్న 5.10 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూమిని కొనుగోలు, వారసత్వాల కింద ఆన్లైన్ అడంగల్, వన్ బి లో చేర్చారని తెలిపారు. డిగ్రీ కాలేజీ భూమికి రెవిన్యూ రికార్డులను తార్ మార్చేసిన అధికారులపై చర్యలు తీసుకొని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని చీఫ్ విప్ జీవి గారి కోరారు. ఆయన స్పందిస్తూ డిగ్రీ కళాశాల భూమి ఆక్రమణలపై అధికారులచే సమగ్ర విచారణ చేయించి కాలేజీ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమి అక్రమనలు, అక్రమాలు జరగకుండా కాపాడేందుకు సహకరించాలని కోరుతూ విద్యార్థులు సిపిఐ, సిపిఎం, పిడిఎం, వైసిపి, టిడిపి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్, కాంగ్రెస్, జనసేన తదితర అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కుంద శివకుమార్, రాజేష్, డేవిడ్, ఆదిత్య,వాసు,రవి,ప్రభాస్, మస్తాన్ వలి, నాగూర్ వలి తదితరులు పాల్గొన్నారు. (Story;డిగ్రీ కాలేజీ భూమిని కాపాడండి..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!