Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్థానిక ప్రభుత్వబాయ్స్ హై స్కూల్ లో చదువుతున్న 700 మంది పిల్లల భవిష్యత్తును కాపాడండి

స్థానిక ప్రభుత్వబాయ్స్ హై స్కూల్ లో చదువుతున్న 700 మంది పిల్లల భవిష్యత్తును కాపాడండి

స్థానిక ప్రభుత్వబాయ్స్ హై స్కూల్ లో చదువుతున్న 700 మంది పిల్లల భవిష్యత్తును కాపాడండి

ఒక హెచ్ఎం, ఐదుగురు టీచర్లతో ఏ విధంగా 700 మంది పిల్లలకు చదువు చెబుతారో విద్యాశాఖ అధికారులు చెప్పాలి

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము విద్యాశాఖ అధికారులు స్పందించాలి

న్యూస్ తెలుగు/వినుకొండ  : ప్రభుత్వ బాయ్స్ హైస్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేసి మా పిల్లలు ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ లో చదువుతున్నారని 700 మందికి ఐదు మంది మాత్రమే టీచర్లు ఉన్నారని ఫోన్ లో తెలియపరచగా అక్కడికి వెళ్లి తల్లిదండ్రులు పిల్లలతో కలిసి స్కూల్ ముందు శనివారం ఉదయం నిరసన తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. 700 మంది పిల్లలకు ఒక హెచ్ఎం ఐదుగురు టీచర్లు ఏ విధంగా చదువు చెప్తారో మాకు అయితే అర్థం కావట్లేదు అని, విద్యాశాఖ అధికారులు చెప్పాలని, పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవద్దని, పక్కనే ఉన్న జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో 50 మంది టీచర్లు ఉంటే ఈ హైస్కూల్ కి ఎందుకు ఐదు మంది టీచర్లు ఉన్నారని విద్యాశాఖ అధికారులు చెప్పాలని, ఈ స్కూల్లో చదివే పిల్లలు ఏం పాపం చేశారు. మేం గత మూడేళ్లగా ఈ స్కూల్లో టీచర్లు కేటాయించమని పల్నాడు జిల్లా కలెక్టర్ కి, విద్యాశాఖ అధికారులకు గ్రీవెన్స్ లో అనేకసార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ పట్టించుకునే నాధుడే లేరని, 2023 లో ఈ స్కూల్లో పాస్ పర్సంటేజీ 50 శాతం కూడా లేదని, కనీసం డిప్యూటేషన్ మీద అయినా ఈ స్కూలుకు టీచర్లను కేటాయించమని అప్పటి విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ ని కూడా అడగటం జరిగిందని, చేస్తాం అని చెప్పడం తప్ప ఏమి ఒరిగింది లేదని, జిల్లా పరిషత్తు హై స్కూల్ కి ప్రభుత్వ హై స్కూల్ కి తేడా ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఈ రెండిటిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కదా ఇక్కడ అక్కడ పనిచేసే వారికి జీతాలు ప్రభుత్వమే ఇస్తుంది కదా మరి ఎందుకు ఇంత వివక్షత. మేము నారా లోకేష్ కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ చదివే పిల్లలందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారు, బయట విద్యను కొనుక్కోలేక ఈ ప్రభుత్వ బాయ్స్ స్కూల్లో చదువుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుతున్నారు అనే ఆశతో ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి అది కాదు ఉన్న టీచర్లు వీళ్ళని కంట్రోల్ చేయడమే కష్టం వీరికి చదువు చెప్పాలన్న చెప్పలేని పరిస్థితి విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ వెంటనే ఈ స్కూలుకు కావాల్సినంత మంది టీచర్లను కేటాయించి 700 మంది పిల్లల భవిష్యత్తును కాపాడవలసిందిగా పిల్లల తల్లిదండ్రుల తరఫున తమరిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు పొట్లూరు వెంకటేశ్వర్లు, జే చెన్నకేశవులు, రామాంజనేయులు, కోటి, అంజి, రమేష్, హుస్సేన్, రాఖి, రామంజి, జై సూర్య, కరీం భాషా, చంటి, బాజీ, పెద్ద సంఖ్య పాల్గొన్నారు.(Story : స్థానిక ప్రభుత్వబాయ్స్ హై స్కూల్ లో చదువుతున్న 700 మంది పిల్లల భవిష్యత్తును కాపాడండి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!