Homeవార్తలుతెలంగాణజులై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

జులై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

జులై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

నాలుగు లేబర్ కోడ్సును రద్దు చేయాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం డిపిఓ కి జులై 9న జరిగే సమ్మె నోటీసును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు, CITU జిల్లాసహయ కార్యదర్శి,RN రమేష్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు. ఎండి హనీ ఫ్, సూర్యవంశం రాము లు మాట్లాడుతూ, శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలలోని 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడలుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కోడ్సు అమలు జరిగితే కార్మిక సంఘాలు ఏర్పాటు కష్టతరం అవుతుంది. కార్మికుల సమిష్టి బేరాసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుంది. ఉద్యోగ భద్రత. ఉపాధి కోల్పోతారు. కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుంది. చట్ట వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడుల అమ్ములను తక్షణమే రద్దు చేయాలని స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని కనీస వేతనం 26,000 అమలు చేయాలని, కాంట్రాక్టు విధానం రద్దు చేసి. కాంట్రాక్టు ఔర్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి. పంచాయితీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి, జీవో నెంబర్ 51 సవరించాలి, మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి పాత కేటగిరీలన్నిటిని కొనసాగించాలి, కారోబార్ బిల్ కలెక్టర్లను సహకార దర్శిల నియమించాలి. అర్హులైన సిబ్బందికి ప్రమోషన్స్ కల్పించాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించాలి. రాజివ్ యువ వికాస్ పథకాన్ని వర్తింపజేయాలని. అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని. పిఎఫ్ ఈఎస్ఐ. పండుగలకు, ఆదివారాలు సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 9న జరిగే సమ్మెలో వనపర్తి జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులందరూ పాల్గొంటారని తెలియజేస్తూ పారిశ్రామిక వివాదాల చట్టం 1947 లోని సెక్షన్ 22 సబ్ సెక్షన్ (1)ని అనుసరించి సమ్మె నోటీసును డిపిఓ గారి కార్యాలయంలో అందజేశాము ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పుష్ప. జిల్లా నాయకులు గంగాదేవి. ఎల్లయ్య, శ్రీనివాసులు, దాస్ భద్రయ్య, శ్రీనివాసులు, నాగన్న తదితరులు పాల్గొన్నారు (Story:జులై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!