గీతాంజలి స్కూల్ ప్రాంగణంలో యోగ
న్యూస్ తెలుగు/వినుకొండ : కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ మరియు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచనల మేరకు వినుకొండ పురపాలక సంఘం నందు అంతర్జాతీయ యోగ మాసోత్సవ కార్యక్రమం మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గీతాంజలి స్కూల్ ప్రాంగణం నందు జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ యోగ యొక్క ప్రయోజనాలు అపారమైనవి మరియు విస్తృతమైనవి. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శారీరక బలం మరియు సమతుల్యత మెరుగుపడతాయి అని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ షకీలా దస్తగిరి మాట్లాడుతూ. యోగా వల్ల ఆరోగ్యం, మరియు శ్రేయస్సు, మానసిక స్పష్టత మెరుగుపడతాయని, ఒత్తిడిని తగ్గించి జీవిత సవాళ్లు సులభంగా ఎదుర్కోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ , యోగా గురువులు లింగ రాజు, గీతాంజలి స్కూల్ డైరెక్టర్ కిషోర్ , మున్సిపల్ ఏఈ ఆదినారాయణ, మున్సిపల్ సిబ్బంది మరియు యోగా సాధకులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.(Story :గీతాంజలి స్కూల్ ప్రాంగణంలో యోగ )