కె. భవిష్య రెడ్డికి ర్యాంకు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన విద్యార్థిని కొత్త భవిష్య రెడ్డి నీట్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 1649వ ర్యాంక్ సాధించడం పట్ల వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన బొల్లా మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతం నుండి జాతీయ స్థాయిలో ఇలాంటి గొప్ప విజయం సాధించడం గర్వకారణం. కొత్త భవిష్య రెడ్డి లాంటి విద్యార్థులు యువతకి ప్రేరణగా నిలుస్తారు. ఆమె విద్యాభవిష్యత్తు మరింత ఉన్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అని తెలిపారు. విద్యారంగంలో ప్రతిభను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుంటామని బొల్లా బ్రహ్మనాయుడు హామీ ఇచ్చారు.(Story : కె. భవిష్య రెడ్డికి ర్యాంకు )

