వేగంగా అడ్మిషన్లు పొందుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేర్
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకోవ డంతో పాటు ఉచిత విద్య, స్కాలర్షిప్స్, పుస్తకాలు, ఇతర సౌకర్యాలు పొందాలని సూచిస్తూ,ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు ప్రతీ రోజు వివిధ గ్రామాల్లో, ఆయా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాఖాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ, విద్యార్థుల అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు శాఖాపూర్ పాఠశాలకు వెళ్లి జిహెచ్ఎం మల్లికార్జునుడు, ఆ పాఠశాల ఉపాధ్యాయులను కలిసి, ఆ పాఠశాలలో 10వ తరగతి పాసైన విద్యార్థుల వివరాలు, విద్యార్థుల టీసీల వివరాల గురించి వివరాలు తీసుకోవడం జరిగింది. ఆ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు గాను, 8 మంది విద్యార్థులు పదవ తరగతిలో పాస్ కావడం జరిగింది. అందులో ఐదుగురు విద్యార్థులు తమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ గ్రూపుల్లో చేరినట్లు కళాశాల అధ్యాపకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, శాఖాపూర్ పాఠశాల విద్యార్థులు తమ కళాశాలలో చేరిన సందర్భంగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిహెచ్ఎం మల్లికార్జునుడు, ఉపాధ్యాయులకు ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు కృతజ్ఞత భావంతో అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ఇంటర్ విద్యను కాపాడడంలో, మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అక్కడ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెబ్బేర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు, సి కృష్ణయ్య , ఇంగ్లీష్ లెక్చరర్ నవీన్ కుమార్, హిస్టరీ లెక్చరర్ ఈశ్వర్ పాల్గొన్నారు. (Story:వేగంగా అడ్మిషన్లు పొందుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పెబ్బేర్)

