ప్రజల్ని అడ్డంగా దోచేస్తున్న ఆన్లైన్ షాపింగ్ యాప్ కంపెనీలు..
న్యూస్ తెలుగు / వినుకొండ : నియోజకవర్గం లోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన వేమా అంకారావు చిరు వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అమెజాన్ షిప్పింగ్ అనే యాప్ ద్వారా గత నెల 31 న మూడు షర్ట్స్ ను బుక్ చేసి డెలివరీ సమయంలో 1000 రూపాయలు చెల్లించి తీసుకోవడం జరిగింది. ఆత్రుతతో ప్యాకింగ్ ను తీసి అందులో పనికిరాని గుడ్డ ముక్కలను చూసి అవాక్కైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై సదరు వ్యాపారి అంకారావు మాట్లాడుతూ. ఆన్లైన్ యాప్ కంపెనీలు తక్కువ ధరకు వివిధ రకాల వస్తువులు అందిస్తున్నామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని ఆశపడితే మొదటికే మోసం జరుగుతుంది. ఇదేవిధంగా మా గ్రామంలో చాలా మందిని మోసం చేశారు. ఇటువంటి కంపెనీలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామన్నారు. దయచేసి ప్రజలు ఎవరూ ఆన్లైన్ యాప్ కంపెనీ మోసాలకు బలి కావద్దని కోరుకుంటున్నాను అన్నారు. (Story:ప్రజల్ని అడ్డంగా దోచేస్తున్న ఆన్లైన్ షాపింగ్ యాప్ కంపెనీలు..)