సరికొత్త మ్యాడ్నెస్ను అందించటానికి సిద్ధమైన ZEE5..
తన వాక్ చాతుర్యంతో సినిమాలకు రివ్యూలు చెప్పే కిస్సా (సంతానం)కు విచిత్రంగా ప్రవర్తించే దర్శకుడు హిచ్‌కాక్ ఇరుదయరాజ్(సెల్వరాఘవన్)..
జీ5 తమిళ, మలయాళ భాషల బిజినెస్ హెడ్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌత్మార్కెటింగ్ లాయిడ్ సి గ్జెవియర్ మాట్లాడుతూ ‘‘ZEE5 లో అత్యుత్తమ సినిమాలను మా ప్రేక్షకులకు అందించటాన్ని మేము గర్వంగా భావిస్తాం. డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవల్ హక్కులను సంపాదించడం ద్వారా, విభిన్నమైన, ఆకర్షణీయమైన ప్రాంతీయ కంటెంట్‌ను అందించాలనే నియమాన్ని మేం పాటిస్తున్నామనే విషయం మరోసారి రుజువైంది. ది షో పీపుల్, నిహారిక ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన ఈ హారర్-కామెడీ మూవీలోని థ్రిల్లింగ్ మూమెంట్లు, హాస్యం, విలక్షణమైన కథా శైలి ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. ఇలాంటి వైవిధ్యాన్ని ప్రేక్షకులకు అందించటం ద్వారా మాకు ప్రేక్షకులతో బలమైన అనుబంధం ఏర్పడుతుందనే నమ్మకముంది. దేశవ్యాప్తంగా సౌత్ కంటెంట్‌పై ఆదరణ పెరిగిన దశలో, ఈ సినిమా మా రీజనల్ కంటెంట్ లైబ్రరీలో భాగం కావటం ఎంతో విలువైనదిగా మేం భావిస్తాం. డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవల్ మా కంటెంట్ ఖజానాకు కొత్త శక్తిని చేరుస్తుందని, అలాగే మా సబ్స్క్రైబర్లకు ఉత్తేజకరమైన అనుభవాన్ని అందిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం’’ అన్నారు.
రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ మాట్లాడుతూ ‘‘డీడీ నెక్ట్స్ లెవల్‌తో రొటీన్‌గా ఉన్న హారర్, కామెడీకి సినిమాలకు దక్కుతున్న ఆదరణ, వాటి హద్దులను చెరిపేయాలన్నదే నా లక్ష్యం. నవ్వించటంతో పాటు భయాన్ని కలిగించేలా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాను. అదే సమయంలో మా ‘సినిమా’కి కూడా ఓ పాత్ర ఉండాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించాను. ది షో పీపుల్, నిహారిక ఎంటర్టైన్మెంట్ నిర్మాతలతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ మీనన్, గీతికా తివారి లాంటి అద్భుత నటులతో కలసి పని చేయడం ద్వారా నేను ఎలాంటి సినిమానైతే చేయాలనుకున్నానో ఆ ఆలోచన విషయంలో ఖచ్చితంగా ఎలాంటి రాజీపడకుండా మేం తెరపైకి తీసుకురాగలిగామని భావిస్తున్నాను. జోనర్ సాంప్రదాయాల్ని మార్చుతూ, ప్రతి మలుపులో ఆశ్చర్యాలతో నిండిన సినిమాను తీర్చిదిద్దాం. ఈ జర్నీ అంతా ఎంతో ఆనందంగా సాగింది. ఇలాంటి వినూత్న సినిమా డిజిటల్ ప్రీమియర్‌కి ZEE5 లాంటి ఉత్తమమైన వేదిక దొరకడం నిజంగా గర్వకారణం. ఇది ఓ గ్లోబల్ స్టేజ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల దాకా ఈ సినిమాను చేర్చగలదు. ఇలాంటి మ్యాడ్నెస్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పంచుకోవడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. త్వరలోనే ‘నెక్స్ట్ లెవెల్’ మొదలవుతోంది!’’ అన్నారు.
నటుడు సంతానం మాట్లాడుతూ ‘‘ఇటీవల నేను చేసిన పాత్రల్లో కిస్సా పాత్ర నా కెరీర్లో అత్యంత వినోదభరితమైన, సృజనాత్మకంగా తృప్తి ఇచ్చింది. ఈ పాత్ర బోల్డ్‌గా ఉంటుంది, విలక్షణమైన పాత్ర. సినిమాలను విమర్శించే రివ్యూవర్ అనుకోకుండా తను ఇష్టంగా విమర్శించే సినిమాల్లాగే ఒక సినిమాలో చిక్కుకుంటాడు. ఈ మెటా మాడ్నెస్, హారర్-కామెడీలోని మలుపులు, హంగామా అన్నీ కలిపి, అసలైన ఫన్ రైడ్‌గా మారాయి. డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవల్ ZEE5 లో ప్రీమియర్ అవుతున్నందుకు నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఇది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. లైట్లు ఆఫ్ చేసి, చేతిలో పాప్‌కార్న్ తీసుకుని ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కామెడీ ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుంది. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్లాంటి మూవీ. మీరు తమిళ సినిమాలన్నీ చూసేశాం అనుకుంటే… ఈ సినిమా నిజంగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది అని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు.
జూన్13 నుంచి జీ5లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్కు సిద్ధమైన ‘డీడీ నెక్ట్స్ లెవల్’ (Story:సరికొత్త మ్యాడ్నెస్ను అందించటానికి సిద్ధమైన ZEE5.. )