పేద ప్రజల పక్షాన సిపిఐ నిరంతర పోరాటం
పేదలకు అండ పోరాడేదే ఎర్రజెండా
న్యూస్‌తెలుగు/వనపర్తి : పేద ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాడేది ఎర్రజెండా అని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు అన్నారు. మంగళవారం పెబ్బేరు మండల కేంద్రంలోని మహాజన హమాలీ సంఘం ఆఫీసులో మండల రెండవ మహాసభ గాంధీ అధ్యక్షతన జరిగింది. సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి విజయరాములు, నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ పేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. పోరాటాలు లేకుండా పేదల కష్టాలు తీరవన్నారు. కమ్యూనిస్టు పార్టీగా భారతదేశ స్వతంత్రం కోసం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, కార్మికుల కర్షకుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నది భారత కమ్యూనిస్టు పార్టీ ఈ పార్టీకి దేశంలో వందేళ్ళ పోరాట చరిత్ర ఉందన్నారు నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిందని, ఇండ్ల స్థలాలు, ఇండ్లు, రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, రైతు గిట్టుబాటు ధర, కూలి రేట్ల పెంపు కోసం, ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు, ఉపాధి హామీ పని తదితర సమస్యలపై ప్రజలను ఏకం చేసి కమ్యూనిస్టులు పోరాడితేనే పాలక ప్రభుత్వాలు అమలు చేశాయన్నారు.పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను, రైతు చట్టాలను ఈ పాలక ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి కార్మికులను కర్షకులను బానిసలుగా చేసే పద్ధతులను అవలంబిస్తున్నాయని కార్మిక, రైతు చట్టాల పరిరక్షణకై పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్ ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు గాంధీ, పెద్ద మన్యం నాయకులు శాంతమూర్తి,వంశీ,రిక్షా రాముడు, పెద్దమగులయ్య, కురుమయ్య, సహదేవుడు, చంద్రయ్య,చిన్న మొగులయ్య, డి కురుమన్న తదితరులు పాల్గొన్నారు. (Story:పేద ప్రజల పక్షాన సిపిఐ నిరంతర పోరాటం)