ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ,బొడ్రాల ప్రతిష్టలతో గ్రామాలు వైభవంగా విలసిల్లుతాయి
వనపర్తి : పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా గత మూడు రోజుల నుండి ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ,బొడ్రాల ప్రతిష్ట,సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇట్టి వేడుకలకు గ్రామస్థుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆలయ మర్యాదలతో సాదరంగా ఆహ్వానించారు. వేద పండితులు గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మతసామరస్యానికి చిహ్నంగా బక్రీద్,ధ్వజస్తంభ,బొడ్రాల ప్రతిష్ట జరగడం శుభసూచకం అని ఈ వేడుకల వల్ల ప్రజలలో భక్తిప్రభత్తులు ఐకమత్యం పెరిగి భవిష్యత్తు తరాలకు మార్గదర్శనంగా నిలుస్తాయని అన్నారు. అనంతరం జిల్లాలో రెండో సత్యనారాయణ దేవాలయం గోప్లాపూర్ గ్రామంలో నిర్మించడం సంతోషదాయకం అని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ధ్వజస్తంభ, బొడ్రాల ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. నిరంజన్ రెడ్డి గారి వెంటజిల్లా ఎస్.టి.సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మాజీ ఎం.పి.టి.సి మిద్దె.కృష్ణ,మాజీ సర్పంచ్.గంధం.లక్ష్మి,నాయకులు వీరసాగర్,చిట్యాల.రాము,శేషిఫణి,నరసింహ,మిద్దె.అశోక్,అంజి యాదవ్, ప్యాట.తిరుపతయ్య,గంధం.శాంతయ్య,బొట్టు.కురుమూర్తి,వెంకటయ్య,రాజేశ్వర్ శెట్టి తదితరులు ఉన్నారు.(Story : ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ,బొడ్రాల ప్రతిష్టలతో గ్రామాలు వైభవంగా విలసిల్లుతాయి )