జనసేన పార్టీ తరఫు పలువురికి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు గా బాధ్యతలు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఈటీవల విడుదల చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలో వినుకొండ నియోజకవర్గంకు సంబంధించి వినుకొండ మండలం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా యాదల సునీత ని మరియు ఈపూరు మండలం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా బొల్లాపల్లి మండల అధ్యక్షుడు హనుమాన్ నాయక్ ని ఇరువురిని జనసేన పార్టీ తరఫున కొంజేటి నాగశ్రీను రాయల్ ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నాగ శ్రీను రాయల్ మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు వినుకొండ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ని మర్యాదపూర్వకంగా కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలో జనసేన పార్టీకి సముచిత స్థానం కల్పించిన జీ వి ఆంజనేయులు ని ఘనంగా సత్కరించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా జనసేన పార్టీకి వారు చేసిన సేవలను గుర్తించి వారికి ఈ పదవి సిఫారసు చేసిన నాగ శ్రీను రాయల్ కి ఇరువురు డైరెక్టర్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ. జనసేన పార్టీలో మనం పని చేసుకుంటూ పోతే పార్టీకి మనం చేసిన సేవలను గుర్తించి పార్టీ మనకు పదవులు ఇస్తుంది అనడానికి ఉదాహరణ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు గా నియమితులు ఆయన యదాల సునీత మరియు రాత్లావత్ హనుమ నాయక్ మనం ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి మాటాడకుండా అదినేత మనకి ఇచ్చిన డైరెక్షన్ లో పని చేస్తూ పార్టీకి మంచి పేరు వచ్చేలా కృషి చేసి ప్రజల్లో పార్టీని బలోపేతం చేసేలా ప్రతి జనసేన కార్యకర్త పని చెయ్యాలి అన్నారు. అదే విధంగా జనసేన తరపున డైరెక్టర్లు గా నియమితులు ఆయన వారు రైతులకు ఉపయోగపడే విధంగా పని చేసి పార్టీకి కి మంచి పేరు వచ్చే విధముగా ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : జనసేన పార్టీ తరఫు పలువురికి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు గా బాధ్యతలు )