అట్టహాసంగా ప్రారంభం
జగన్ అడ్డాలో మహానాడు
ఆకట్టకున్న ఫోటో ప్రదర్శన
కడపలో 10/10 గెలవాలి
మహానాడు చరిత్ర సృష్టిస్తోంది
మహానాడులో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం
న్యూస్ తెలుగు/అమరావతి: మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అడ్డా అయిన కడపలో టీడీపీ మహానాడు అట్టహాసంగా మంగళవారం ప్రారంభమైంది. ఈ ప్రాంగణం వేదిక వద్దకు టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు అందరికీ అభివాదం చేస్తూ చేరుకున్నారు. అంతకుముందు పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి, ఆపై పార్టీ జెండాను ఎగురవ వేశారు. తరువాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో మహానాడు వేడుక లాంఛనంగా ప్రారంభమైంది. తొలుత మహానాడు ప్రాంగణానికి చేరుకున్న వెంటనే.. చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధుల నమోదు కేంద్రంలో అధినేత చంద్రబాబు పేరు నమోదు చేసుకున్నారు. ఆపై మహానాడు చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. మహానాడు వేడుకలో అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీన్ని తొలిసారిగా డిజిటల్ ఫార్మాట్‌లో టీడీ జనార్థన్, శ్రీపతి సతీష్ ఏర్పాటు చేశారు. నారా, నందమూరి కుటుంబాలకు సంబంధించిన విశేషాలను తెలియజేసేలా ఫోటోలను ప్రదర్శించారు. యువగళం పాదయాత్ర విశేషాలను ప్రదర్శించారు. ఈ ఫోటో ప్రదర్శన ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్‌కు సంబంధించిన జీవిత చరిత్ర విశేషాల పుస్తకాలతో పాటు ఎన్టీఆర్ అసెంబ్లీలో ప్రసంగించిన ముఖ్యమైన ఘటనల పుస్తకాలను కూడా ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన అనంతరం రక్తదాన శిబిరం, వైద్య శిబిరాలను సీఎం ప్రారంభించారు. రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి రక్తదానం చేసి చంద్రబాబు నుంచి తొలి సర్టిఫికెట్‌ను పొందారు. రక్తదానం చేసిన వారి వద్దకు వెళ్లి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ, ఈ సారి మహానాడు చరిత్ర సృష్టించబోతోందని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకుగానూ 7 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు ఆయన దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని, అక్రమ కేసులు పెట్టి హింసించారని, ఇక ప్రశ్నించిన కార్యకర్తలను పొట్టన బెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తన పాదయాత్ర నుంచి లోకేష్ యువగళం వరకు, కార్యకర్తల్లో అదే స్ఫూర్తి, అదే పోరాట పటిమ ఉందన్నారు. జెండా మోస్తున్న కార్యకర్తలే.. టీడీపీ బలమని ఆయన అభివర్ణించారు. తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పని చేస్తుందని స్పష్టం చేశారు. పటేల్ – పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం తదితర అంశాలు తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైనాయని, రూ.2 కిలో బియ్యం, సబ్సిడీ కరెంట్ కూడా ఈ పార్టీనే తీసుకు వచ్చిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలు, వర్గాల అభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.
ప్రజల కోసమే నిలబడ్డాం: మంత్రి నారా లోకేష్
విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడ్డామని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం, బలగమని, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవమే పార్టీ మూల సిద్ధాంతమని, తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలు తీసుకొచ్చామని అభివర్ణించారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో ఎన్నో అరాచకాలు చూశామని, సమాజంలో ఆడవాళ్లను చులకనగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే వేదికపై మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు ప్రసంగించారు. (Story: జగన్ అడ్డాలో మహానాడు)
Follow the Stories:
యూనియన్ బ్యాంకులో ఉద్యోగాల జాతర
ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)