Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్వాహా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

స్వాహా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

స్వాహా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ పట్టణంలో సిపిఐ ఎం. ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో వినుకొండ పట్టణ కార్యదర్శి ఎస్కె ఫిరోజ్, మండల కార్యదర్శి ధూపాటి నాని అధ్యక్షత వహించారు. వినుకొండ పట్టణంలోని 212 సర్వే నెంబరు 175 సెంట్లు సీలింగ్ ల్యాండ్ ని ఆనాటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తప్పుడు రికార్డులను సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిపిఐ ఎంఎల్ ఏ పల్నాడు జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు మాట్లాడుతూ. 1976 సంవత్సరంలో ఫీలింగ్ వ్యక్తి కింద గోనుగుంట్ల వెంకటేశ్వరరావు 1 75 సెంట్లు ప్రభుత్వానికి తప్పు చెప్పడం జరిగింది. సర్వేనెంబర్ 212 ఆ తర్వాత ఒక ఎస్సి కి డీకే పట్టా ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. ఆ ఎస్సీ నీ బెదిరించి డబ్బు ఆశ చూపి ప్రముఖ కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత 15 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భూమిని మీరు కంపెనీ పేరు తోటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రెవెన్యూ ఆక్ట్ ప్రకారం సీలింగ్ ల్యాండ్ ని ఎవరు అమ్మకూడదు కొనకూడదు ఈ మొత్తం సమాచార చట్టపకారం డాక్యుమెంట్లు తీసుకొని కలెక్టర్ కి, ఆర్డిఓ కి, ఎమ్మార్వో కి, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కి నెలరోజుల క్రితమే అర్జీ ఇవ్వటం జరిగింది. ఈనాటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోపోగా సోమవారం లిబ్రేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. పది రోజుల్లో అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేసి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి కొద్ది మంది ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటివారిని అరికట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మార్వో సురేష్ నాయక్ కు అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ధూపాటి నాని, పట్టణ కార్యదర్శి రైసాంగం నాయకులు కామా వెంకటేశ్వర్లు, భాస్కర్, సంఘం ప్రసాద్, ముప్పాళ్ళ ప్రసాద్, సాయిబాబా, గుంటి నాగేశ్వరరావు, పందులపాటి వెంకటేశ్వర్లు, ఎలమంద కుమార్, గొంగడి సంతోష్, వన్నూరయ్య, తదితరులు పాల్గొన్నారు.(Story : స్వాహా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!